E-Paper
Advertisement

OTT Movie : వణుకు పుట్టిస్తూ వెంటాడే దెయ్యం… బ్లాక్ బస్టర్ హారర్ సినిమా ఓటీటీ ఎంట్రీ …

OTT Movie : వణుకు పుట్టిస్తూ వెంటాడే దెయ్యం…  బ్లాక్ బస్టర్ హారర్ సినిమా ఓటీటీ ఎంట్రీ …

OTT Movie : హారర్ థ్రిల్లర్ జానర్ అంటేనే భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇలాంటి జానర్ లో మోహన్ లాల్ వారసుడు ప్రణవ్ నటించిన సినిమా ‘డీయస్ ఈరే’. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. మేకర్స్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ఈ సినిమాలో ప్రణవ్ యాక్టింగ్ స్కిల్స్ ని ఓ రేంజ్ లో చూపించాడు. హంటెడ్ ఘోస్ట్ చుట్టూ తిరిగే ఈ సినిమా యాభై కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ అయింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుండటంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ కూడా దీనిని చూసేందుకు ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుంది ? స్ట్రీమింగ్ ఎప్ప్పుడు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అంటే

రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వచ్చిన ‘డీయస్ ఈరే’ డిసెంబర్ 5 నుంచి జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 2025న అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, తెలుగులో నవంబర్ 7న రిలీజయింది. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో రానుంది. ప్రణవ్ హీరోగా నటించిన ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి, రామచంద్ర, శశికాంత్ నిర్మించారు. సుష్మితా భట్, షైన్ టామ్ చాకో, జిబిన్ గోపీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

రోహన్ (ప్రణవ్) రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆర్కిటెక్ట్. అతను ఒక పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. పేరేంట్స్ మాత్రం అమెరికాలో ఉంటారు. ఒక రోజు అతని క్లాస్ మేట్ కని సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు. రోహన్, కని గతంలో రిలేషన్ లో ఉన్నారు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. కని వాళ్ళింటికి వెళ్లిన రోహన్ అక్కడ్నుంచి కని హెయిర్ క్లిప్ ఒకటి తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పట్నుంచి కని ఆత్మ రోహన్ ని వెంటాడుతుంది. రోహన్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. మొదట అది కని ఆత్మ అని రోహన్ కి అనుమానం వస్తుంది.

Read Also : ఆరు ఆస్కార్లు గెలిచిన సినిమా … బ్యాండ్ వాయించే వాడితో ప్రేమ… ఊహిం

అయితే ఒక రోజు కని తమ్ముడు రోహన్ ఇంటికి వస్తే ఆ ఆత్మ అతన్ని మేడ మీద నుంచి కిందకు పడేస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలతో అది కని ఆత్మ కాదని, ఒక అబ్బాయి ఆత్మ అని అర్ధమవుతుంది. దీంతో అసలు విషయం తెలుసుకోవడానికి రోహన్ ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో రోహన్ కి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. క్లైమాక భయంకరమైన సంఘటనలతో ముగుస్తుంది. చివరికి రోహన్ ని ఇబ్బంది పెడుతున్న ఆత్మ ఎవరిది? ఎందుకు రోహన్ ని ఇబ్బంది పెడుతుంది? కని ఎలా చనిపోయింది ? ఈ కథకి ముగింపు ఎలా ఉంటుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలను, ఈ మళయాళ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×