BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – వారికి ఆకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – వారికి ఆకస్మిక ప్రయాణాలు

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 06వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:  

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు.  బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

వృషభ రాశి:

నూతన వాహన సౌక్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.


మిథున రాశి:  

చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట  బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు.

కర్కాటక రాశి:

ఆకస్మిక ధన లాభ  సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులువివాదాలు సర్దుబాటు కాగలవు.

సింహరాశి:

ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

కన్యారాశి :

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట  బాధ్యతలతో భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన  కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు.

వృశ్చికరాశి:

వృత్తి వ్యాపారాలలో  మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు  నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ధనస్సు రాశి:

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు గతం కంటే  మెరుగవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మకరరాశి:

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి  మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కుంభరాశి:

ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు.  ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి.  వ్యాపారాలు మందకోడిగా  సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

మీనరాశి:

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/11/2025) ఆ రాశి ఉద్యోగుల సమస్యలు తీరుతాయి – వారికి ఆర్థికపరమైన నష్టాలు   

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (03/11/2025) ఆ రాశి వారికి  ఆకస్మిక ధనలాభం – వారికి నూతన వాహన యోగం

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 2 – నవంబర్‌ 8)  ఆ రాశి వారికి అదనపు ఆదాయం – వారికి ధనపరమైన ఇబ్బందులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/11/2025) ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వారికి స్తిరాస్థి వివాదాలు పరిష్కారం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/11/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు 

Monthly Horoscope in Telugu: ఈ నెల రాశిఫలాలు: నవంబర్ లో ఆ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి – వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Big Stories

×