VSKP-MBNR Train: విశాఖపట్నం- మహబూబ్‌నగర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఉన్నట్లుండి చక్రాల మధ్య ఒక్కసారిగా నిప్పురవ్వులు చెలరేగాయి. పరిస్థితి గమనించిన రైల్వే సిబ్బంది దాదాపు అరగంటకు పైగానే మార్గ మధ్యలో రైలు నిలుపు వేశారు. ఆ తర్వాత మరొక స్టేషన్‌కి వచ్చిన మార్పులు చేశారు. ఇంతకీ ఎక్కడ జరిగింది?
విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు
విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు (12861)కు పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి-బిక్కవోలు మధ్య ట్రైన్ చక్రాలకు నిప్పురవ్వలు కనిపించాయి. వెంటనే భయభ్రాంతులకు గురయ్యారు ప్రయాణికులు. అలర్టయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దీంతో మార్గమధ్యలో వరి పొలాల మధ్య రైలు ను సుమారు అరగంట పాటు నిలిపి వేశారు అధికారులు. చివరకు నిప్పు రవ్వల వెనుక లోపాన్ని గమనించారు రైల్వే సిబ్బంది. బ్రేకులు సరి చేసి రైలును రాజమండ్రి స్టేషన్‌కు తీసుకొచ్చారు లోకో పైలట్. రాజమండ్రి చేరుకున్న తర్వాత బోగిని మార్చారు అధికారులు. ఆ తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
చక్రాల మధ్య నిప్పురవ్వులు, ప్రయాణికులు బెంబేలు
గడిచిన రెండు రోజులుగా వివిధ ప్రాంతాల్లో రైళ్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం సీజన్ ప్రారంభం కావడంతో.. ఉత్తరాదిలో మరింత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే దట్టమైన పొగమంచు కారణంగా ట్రైన్ రూటు సరిగా కనిపించదు. దీని కారణంగా ప్రతీ ఏటా ఈ సీజన్‌లో ప్రమాదాలు జరుగు తున్నాయిని గుర్తు చేస్తున్నారు.
అహ్మదాబాద్ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాలకు రకరకాల సమస్యలు తలెత్తాయి. పలు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి.. ఇంకా అవుతున్నాయి కూడా. టేకాఫ్ సమయంలో రకరకాల సమస్యలు రావడంతో విమానాలను ఎమర్జెన్సీగా ల్యాండింగ్ అయ్యాయి కొన్ని విమానాలు. నిర్వహణ లోపంగా కారణంగా ఇదంతా జరుగుతోందని గమనిస్తున్నారు. ప్రస్తుతం విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి.
ALSO READ: మూడు గంటల్లో శ్రీవారి దర్శనం-టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
ఇటీవల ఏపీలోని కర్నూలులో ట్రావెల్ బస్సు ఘటన 19మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జరిగి రెండు వారాల్లో చేవెళ్ల బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ మధ్యకాలంలో చాలా బస్సులు ప్రమాదానికి గురయ్యారు. బస్సులో ప్రయాణించాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. తొలుత విమానం, బస్సు, రైళ్లు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికుల్లో ఓ తరహా ఆందోళన మొదలైంది.