E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు  
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 8వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వృషభ రాశి:

Advertisement

అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహ పరుస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తికావు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్య పరుస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.

మిథున రాశి:  

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటక రాశి:

Advertisement

నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి.

సింహరాశి:

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదోడుకులుగా ఉంటుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

కన్యారాశి :

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో రెండు రకాలయిన ఆలోచన వలన ఇబ్బందులు తప్పవు. బంధువులు, మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికరాశి:

కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న సమయానికి  అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనస్సు రాశి:

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. ఉద్యోగస్తులకు స్దాన చలన సూచనలు ఉన్నవి.

మకరరాశి:

వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

కుంభరాశి:

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

మీనరాశి:

దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలించక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. సహోద్యోగుల ప్రవర్తన  కొంత చికాకు పరుస్తుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×