OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏ భాషలో వచ్చినా అదరిస్తున్నారు ప్రేక్షకులు. ఆడియన్స్ ని మెప్పించడానికి, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య ఇలాంటి కథలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇండోనేషియన్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా సరికొత్తగా వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ కథ ప్రియురాలి కోసం, సొంత భార్యని చంపుతాడు భర్త. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. క్లైమాక్స్ వరకు టెన్షన్ తో హీట్ పుట్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘డెండమ్ మలం కెలమ్’ (Dendam malam kelam) ఇండోనేషియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనికి డానియల్ రిఫ్కి దర్శకత్వం వహించారు. ఇందులో బ్రాంట్, మారిస్సా, ఆర్యా సలోకా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 28న ఇండోనేషియాలో రిలీజ్ అయ్యింది. IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
జెఫ్రీ ఒక కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. అతను తన స్టూడెంట్ సారాతో ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే జెఫ్రీకి ఇదివరకే, సోఫియా అనే యువతితో పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. ఈ సమయంలో అతని భార్య సోఫియా వాళ్ల ప్రేమకు అడ్డుగా ఉంటుంది. అందుకే జెఫ్రీ, సారా కలిసి సోఫియాను చంపేయాలనుకుంటారు. ఈ ప్లాన్ ని అమలు చేస్తారు కూడా. వాళ్లు ఆమెను చంపి, శవాన్ని ఒక స్టోర్ రూమ్ లో పెడతారు. ఏమీ తెలియనట్లు బిహేవ్ చేస్తారు. కానీ స్టోర్ రూమ్ నుంచి సోఫియా శవం మాయమవుతుంది. ఇక ఈ ప్రేమికులు తెగ భయపడిపోతారు. శవం ఏమైందో అని టెన్షన్ పడతారు.
Read Also : ఫస్ట్ నైట్ రోజే పరలోకానికి… పెళ్లి కొడుకుకి ఫ్యూజులు అవుటయ్యే షాక్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్