E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (21/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (21/09/2025)               
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 21వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.  దూరప్రయాణ సూచనలు ఉన్నవి.  దైవ సేవా కార్యక్రమాలలో  విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

వృషభ రాశి:

Advertisement

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు  అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మిథున రాశి:  

స్త్రీ సంబంధ విషయాలలో  కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

కర్కాటక రాశి:

Advertisement

శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో  అధికారులను ఆకట్టుకొంటారు.  వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

సింహరాశి:

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు.

కన్యారాశి :

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో  పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు  ఇస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. నూతన వ్యాపారాలు  ప్రారంభించక  పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి  వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా  సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికరాశి:

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ  కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.  వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ  ప్రయత్నాలు కొంత నిధానంగా  సాగుతాయి.

ధనస్సు రాశి:

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత  అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత  అవకాశాలు పొందుతారు.  వ్యాపారాలలో  విశేషమైన  లాభాలను పొందుతారు.

మకరరాశి:

దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర  ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో సమస్యలు  శిరో బాధను కలిగిస్తాయి. ధన  పరంగా ఒడిదుడుకులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

కుంభరాశి:

మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. వృత్తి  వ్యాపారాలు అనుకూలముగా  సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి  అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు  రాజీ చేసుకుంటారు.

మీనరాశి:

వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో  వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు  సద్వినియోగం చేసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×