BigTV English

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

IRCTC Singapore – Malaysia Tour Package:

భారతీయ రైల్వే చక్కటి టూర్ ప్యాకేజీలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇండియాతో పాటు విదేశాల్లోనూ పర్యటించే అవకాశం కల్పిస్తుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు పర్యాటకులకు విదేశాల్లో ఎంజాయ్ చేసే ప్రత్యేక అవకాశాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే సింగపూర్-మలేషియా టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. అక్టోబర్ 27న ప్రారంభమయ్యే ఈ టూర్ 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. వెంటనే ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.


జైపూర్ నుంచి టూర్ ప్రారంభం

IRCTC అందిస్తున్న సింగపూర్-మలేషియా టూర్ ప్యాకేజీ జైపూర్ నుంచి ప్రారంభం అవుతుంది. 7 రోజుల పర్యటన అక్టోబర్ 27న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా జైపూర్ నుండి విమాన ప్రయాణం, 3 స్టార్ హోటళ్లలో వసతి, వీసా ఫీజులు, భారతీయ రెస్టారెంట్లలో భోజనం, AC డీలక్స్ బస్సులలో సందర్శనా స్థలాలు,  ఎంట్రీ ఫీజులు, టూర్ గై, ప్రయాణ బీమా అందిస్తుంది.

టూర్ ప్యాకేజీ ఛార్జ్ ఎంత ఉంటుందంటే?

సింగపూర్- మలేషియా టూర్ ప్యాకేజీ ధర కూడా మిడిల్ క్లాస్ కు అందుబాటులోనే ఉన్నట్లు IRCTC ప్రకటించింది. డబుల్ ఆక్యుపెన్సీపై ఒక్కో వ్యక్తికి రూ.1,25,085 ఛార్జ్ వసూలు చేస్తున్నారు. 5% TCS పన్ను వాపసు తర్వాత ఒక్కో వ్యక్తికి రూ. 1,18,820కి తగ్గనుంది. IRCTC వెబ్‌ సైట్‌ లో లేదంటే జైపూర్‌లోని వారి ప్రాంతీయ కార్యాలయంలో బుకింగ్‌లు చేసుకోవచ్చు. ఇప్పటికే పర్యాటకుల నుంచి మంచి ఈ టూర్ కు మంచి స్పందన వస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.


సింగపూర్- మలేషియా టూర్ ప్యాకేజీ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

సింగపూర్- మలేషియా టూర్ ప్యాకేజీ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు IRCTC వెబ్‌ సైట్ www.irctctourism.comలో లేదంటే జైపూర్‌లోని IRCTC ప్రాంతీయ కార్యాలయాన్ని (708, 7వ అంతస్తు, క్రిస్టల్ మాల్, బానిపార్క్, కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో) సందర్శించి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి సమాచారం, సహాయం కోసం 8595930997, 9001094705 వాట్సాప్ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also:  ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

కరోనా తర్వాత తగ్గిన విదేశీ ప్రయాణాలు

నిజానికి కోవిడ్-19 మహమ్మారి తర్వాత అంతర్జాతీయ పర్యాటకం చాలా కాలంగా నిలిపివేయబడింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో, ప్రజలు మళ్ళీ విదేశీ టూర్ ప్యాకేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే IRCTC కూడా చక్కటి టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తక్కువ ధరల్లో విదేశాలకు వెళ్లి రావాలనుకునే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది.

Read Also: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Related News

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Big Stories

×