OTT Movie : ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఒక తమిళ సినిమా, సీట్ ఎడ్జ్ థ్రిల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మైండ్ బెండ్ అయ్యే ట్విస్టులతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సినిమా సెగలు పుట్టిస్తోంది. ఈ కథ ఒక మూగ, చెవిటి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రిలో ఉన్న తన తండ్రిని లక్ష్యంగా చేసుకున్న ఒక రూత్‌లెస్ గ్యాంగ్‌తో ఇతను పోరాడాల్సి వస్తుంది. వాళ్ళ నుంచి ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నాలతో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Thiruvin Kural’ 2023లో విడుదలైన తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. దీనికి హరీష్ ప్రభు దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మించారు. ఇందులో అరుల్‌నితి (తిరు), భరతిరాజా (మరిముత్తు), ఆత్మిక (భవాని) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 57 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 5.0/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం సందర్భంగా థియేట్రికల్ రిలీజ్ అయింది. 2023 మే 11నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ తిరు అనే మూగ, చెవిటి ఉన్న యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్. తన తండ్రి మరిముత్తు, ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్‌తో కలిసి పని చేస్తాడు. తిరు ఒక నిజాయితీ పరుడు. కానీ కోపిష్టి స్వభావం ఉన్నవాడు. తన అత్త కూతురు భవానితో నిశ్చితార్థం జరగడంతో హ్యాపీ మూడ్ లో ఉంటాడు. ఈ సమయంలో ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో మరిముత్తు గాయపడతాడు. అతన్ని ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిస్తారు. ఇక్కడ నుండి కథలో ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆసుపత్రిలో ఒక లిఫ్ట్ ఆపరేటర్ తో సహా నలుగురు క్రిమినల్స్ గ్యాంగ్, డబ్బు కోసం ఏదైనా చేస్తుంటారు.
ఇప్పుడు మరిముత్తును టార్గెట్ చేస్తారు. ఈ గ్యాంగ్ ఆసుపత్రిలో రోగులను, వారి కుటుంబాలను ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ, హత్యలు కూడా చేస్తుంది. తిరు తన డిసేబిలిటీస్ ఉన్నప్పటికీ, తన తండ్రిని, కుటుంబాన్ని కాపాడేందుకు ఈ గ్యాంగ్‌తో ఫైట్ చేస్తాడు. క్లైమాక్స్‌లో ఊహించని మలుపులతో ఈ కథ ముగుస్తుంది. తిరు ఆ గ్యాంగ్ ను ఎలా ఎదుర్కొంటాడు ? ఆ గ్యాంగ్ ఎందుకు ఈ ఫ్యామిలీని టార్గెట్ చేసింది ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : షార్ట్ కట్ రోడ్లో వెళ్లి అపరిచితుడితో అడ్డంగా బుక్… 24 గంటల్లో నడిచే మలయాళ టామ్ అండ్ జెర్రీ స్టోరీ