E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (25/09/2025)               
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 25వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.   

వృషభ రాశి:

Advertisement

అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన  వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.  ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

మిథున రాశి:  

తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు  మందకోడిగా సాగుతాయి. ఉద్యోగమున  అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి. 

కర్కాటక రాశి:

Advertisement

సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  దూరపు బంధువుల ఆగమనంతో  గృహమున సందడి వాతావరణం ఉంటుంది.  వృత్తి , వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి.

సింహరాశి:

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  సోదరులతో స్ధిరాస్తి  వివాదాలు  పరిష్కారమౌతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి   వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.  

కన్యారాశి :

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది . ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి . పాత ఋణాలు తీర్చడానికి  నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో  ఆకస్మిక మార్పులుంటాయి. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పదు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

కొన్ని  వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంట బయట  విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలోలాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికరాశి:

అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు  మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో  కాని  పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి.  ఆధ్యాత్మికచింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

ధనస్సు రాశి:

నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో  కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి.  

మకరరాశి:

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.  ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు.  వ్యాపారమునకు  పెట్టుబడులు అందుతాయి.

కుంభరాశి:

ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. మీ ప్రవర్తన ఇతరులకు  ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.   ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనరాశి:

ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది.  దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు మాట ఇచ్చే  విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×