BigTV English

OTT Movie : అడుగు పెట్టగానే కుప్పకూలే కలల సౌధం… చివరి వరకూ ట్విస్టులే… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : అడుగు పెట్టగానే కుప్పకూలే కలల సౌధం… చివరి వరకూ ట్విస్టులే… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : కామెడీ జానర్ లో వచ్చే సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలను భాషతో కూడా సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కొరియెన్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి తన 11 సంవత్సరాల కష్టార్జితంతో ఒక కొత్త ఇంటిని కొంటాడు. అయితే అందులోకి వెళ్ళిన వెంటనే అది 500 మీటర్ల లోతు సింక్‌హోల్‌లో పడిపోతుంది. ఆతరువాత స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ కొరియెన్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘సింక్‌ హోల్’ (Sinkhole) 2021లో విడుదలైన సౌత్ కొరియన్ కామెడీ ఫిల్మ్. దీనికి కిమ్ జి-హూన్ దర్శకత్వం వహించారు. ఇందులో చా సీయుంగ్-వాన్, కిమ్ సంగ్-క్యూన్, లీ క్వాంగ్-సూ, కిమ్ హై-జూన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 ఆగస్ట్ 6న 74వ లొకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ జరిగింది. 2021 ఆగస్ట్ 11న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. 1 గంట 54 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా కొరియన్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

డాంగ్-వాన్ అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్, 11 సంవత్సరాల కష్టంతో సియోల్ శివార్లలో ఒక కొత్త ఇంటిని కొంటాడు. అతని భార్య, చిన్న కొడుకుతో ఆ ఇంట్లోకి హ్యాపీగా మూవ్ అవుతాడు. కానీ ఇంట్లో ఫ్లోర్ కొంచెం క్రూకెడ్‌గా ఉండటం, రోడ్డు మీద క్రాక్స్, వాటర్ సప్లై ఇష్యూస్ లాంటి డిఫెక్ట్స్ కనిపిస్తాయి. డాంగ్-వాన్ పక్కింటి మన్-సూ అనే ఒక సింగిల్ ఫాదర్ తో ఈ విషయంలో ఎప్పుడూ తగువులు పడతాడు. ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ కామెడీగా ఉంటుంది. డాంగ్-వాన్ తన కొత్త ఇంటి హౌస్‌వార్మింగ్ పార్టీకి కో-వర్కర్స్ సీయుంగ్-హ్యూన్, యూన్-జూ ని ఇన్వైట్ చేస్తాడు. పార్టీ రాత్రి జోరుగా సాగుతుండగా, భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా భూమి కుంగిపోతుంది. మొత్తం బిల్డింగ్ 500 మీటర్ల లోతు సింక్‌హోల్‌లోకి జారిపోతుంది.


సింక్‌హోల్‌లో చిక్కుకున్న డాంగ్-వాన్, మన్-సూ, సీయుంగ్-హ్యూన్, యూన్-జూ, మన్-సూ కొడుకు సీయుంగ్-తే బయటపడేందుకు ట్రై చేస్తారు. వర్షం మళ్లీ పడటంతో సింక్‌హోల్‌లో నీళ్లు నిండిపోతాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. డాంగ్-వాన్ తన ఫ్యామిలీని సేవ్ చేయడానికి, మన్-సూ తన కొడుకుతో బాండ్ రిపేర్ చేయడానికి ప్రాణాలు పణంగా పెడతారు. ఒక సీన్‌లో మన్-సూ “యూట్యూబ్‌లో బేర్ గ్రిల్స్ వీడియోస్ చూసి నేర్చుకున్నా” అంటూ మట్టితో చికెన్ గ్రిల్ చేసే సన్నివేశం ఫన్నీగా, ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో సర్వైవర్స్ స్మార్ట్ ఐడియాస్‌తో బయటపడే ప్రయత్నం చేస్తారు. కానీ కొందరు ట్రాజిక్‌గా మిస్సింగ్ అవుతారు. వీళ్ళు అక్కడి నుంచి బయట పడతారా ? మిస్సింగ్ అయిన వాళ్ళు తిరిగి వస్తారా ? ఆ బిల్డింగ్ ఎందుకు కూలిపోతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

Related News

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంటర్వ్యూకు వచ్చిన 8 మంది ఒకే గదిలో… అమ్మాయి బట్టలు విప్పుతూ… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

Big Stories

×