BigTV English

OG Movie Review : ‘ఓజి’ మూవీ రివ్యూ – ఫుల్ మీల్స్ కాదు.. ప్లేట్ మీల్సే

OG Movie Review : ‘ఓజి’ మూవీ రివ్యూ – ఫుల్ మీల్స్ కాదు.. ప్లేట్ మీల్సే

OG Movie Review : దాదాపు 3 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజి ఓజి’ అంటూ తెగ జపిస్తూ వచ్చారు. ఆ సినిమా గ్లిమ్ప్స్ ని యూట్యూబ్లో రిపీటెడ్ గా చూస్తూ వస్తున్నారు. మొత్తానికి వారి నిరీక్షణకి తెర దించుతూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఓజి’ చిత్రం. మరి ఈ సినిమా ప్రేక్షకులను మరీ ముఖ్యంగా పవన్ అభిమానులను ఎంత వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…


కథ :

ఓజి అలియాస్ ఓజాస్ గంభీర(పవన్ కళ్యాణ్) ఒక అనాథ. ఇతన్ని జపాన్ కి చెందిన ఓ సమురాయ్ చేరదీసి పెంచుతాడు. అయితే ఒక దాడిలో ఆ పెద్దాయనతో పాటు అతని జనం అంతా మరణిస్తారు. ఒక్క ఓజీ మాత్రం తప్పించుకుంటాడు. అక్కడి నుండి ఇండియాకి వచ్చేయాలని ఓ షిప్ ఎక్కుతాడు. అందులో ఇంకో పెద్దాయన సత్య దాదా(ప్రకాష్ రాజ్) అతనికి పరిచయం అవుతాడు. షిప్ లో జరిగిన దాడిలో తన బంగారాన్ని అతన్ని మనుషులను కాపాడినందుకు గాను ఓజిని చేరదీస్తాడు సత్య దాదా. అయితే కొన్ని కారణాల వల్ల సత్య దాదా కుటుంబానికి దూరమవుతాడు ఓజి.

అదే టైంలో మారణాయుధాలు(ఆర్.డి.ఎక్స్) కలిగిన ఓ కంటైనెర్ ను సత్య దాదా పోర్టులో దింపుతాడు జిమ్మి(సుదేవ్ నాయర్). ఇతను మహా క్రూరుడు అయినటువంటి ఓమి(ఇమ్రాన్ హష్మీ) సోదరుడు.ఆ కంటైనెర్ అనేది ఓమికి,జిమ్మికి చాలా ముఖ్యం. కానీ ఆ కంటైనెర్ వాళ్లకి దక్కడానికి వీలు లేదు అని భావించి సత్య దాదా దాన్ని దాచేస్తాడు. దీంతో ఓమి, జిమ్మి .. సత్య దాదా కుటుంబాన్ని వేధిస్తారు.


ఈ క్రమంలో ‘ఓజి’ ముంబైకి తిరిగి వచ్చి సత్య దాదా అలాగే అతన్ని కుటుంబాన్ని కాపాడాడా? ఓమి కంటైనెర్ దక్కించుకోవడానికి ఎన్ని దారుణాలు చేశాడు.అసలు ‘ఓజి’ సత్య దాదా కుటుంబానికి దూరమయ్యేందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? మధ్యలో కన్మణి(ప్రియాంక అరుల్ మోహన్) పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

ట్రైలర్ చూస్తేనే ‘ఓజి’ కథ 90 శాతం అంచనా వేసే విధంగానే ఉంటుంది. సో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనే ఆశతో ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడు. అయితే సినిమా మొదలైన మొదటి 15 నిమిషాలకే ‘ఇందులో కొత్తగా ఏమీ ఉండదు’ అనే ఆలోచనకి ప్రేక్షకుడు వచ్చేస్తాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్, ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్.. వీటికి తమన్ అందించిన ఆర్.ఆర్ ఆకట్టుకుంటాయి. కానీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ట్రాక్ ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటి నుండి సినిమా ఫ్లాట్ అయిపోతుంది.

ఆ ట్రాక్ చాలా వరకు సీరియల్ ని తలపిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ని దర్శకుడు బాగా డిజైన్ చేసుకున్నాడు. దీంతో అప్పటి వరకు ఉన్న లోపాలు ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ మేనియాలో కొట్టుకుపోతాయి. ఇక సెకండాఫ్ లో మళ్ళీ హీరో ముంబైకి ఇవ్వడం..జరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్.. ఆ వెంటనే వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అలరిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ సినిమా ఫ్లాట్ అయిపోతుంది. తర్వాత ఏ దశలోనూ కోలుకోదు.

దర్శకుడు సుజిత్ ‘సాహో’ లో చేసిన తప్పులే.. కాదు కాదు అంతకు మించిన తప్పులే ఇందులో కూడా చేశాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలివేషన్స్ ఇచ్చేసి మేనేజ్ చేసేద్దాం అనుకున్నాడు. అవి సింక్ అవ్వకపోవడంతో అతని ప్రయాస వ్యర్థమైపోయింది.ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే ఇందులో ‘సాహో’ ని కూడా టచ్ చేశాడు సుజిత్. లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లాగా ఇది సుజిత్ యూనివర్స్ అనుకోవాలేమో. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. పాటలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెళ్ళిపోతాయో.. తెలీకుండానే వెళ్లిపోతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.

నటీనటుల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ నటుడిగా ఇందులో కొత్తగా చేసిందేమి లేదు.కానీ యాక్షన్ ఎపిసోడ్స్ లో , నడకలో తన శ్వాగ్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. అభిమానులకు కావాల్సింది అదే. కాకపోతే ఊరికూరికే అరవడం అనేది కామన్ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. ప్రియాంక అరుల్ మోహన్ ఎప్పటిలానే బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ తో లాగించేసింది. ప్రకాష్ రాజ్ నటన కూడా కొత్తగా ఏమీ ఉండదు. శ్రీయ రెడ్డి,హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ బాగా చేశారు. ఇమ్రాన్ హష్మీ విలనిజం పెద్దగా మెప్పించదు. అతని కటౌట్ కూడా పవన్ కళ్యాణ్ ముందు తేలిపోయింది.శుభలేఖ సుధాకర్ పాత్రని బిల్డప్ కోసం వాడుకుని సైడ్ చేసేశారు. ఏ దశలోనూ అతను పవర్ఫుల్ విలన్లా కనిపించడు. మిగతా నటీనటుల పాత్రలు అంతగా గుర్తుండవు.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్
ప్రీ ఇంటర్వెల్ బ్లాక్
పోలీస్ స్టేషన్ ఎపిసోడ్
థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం
అనవసరమైన ఎలివేషన్లు
సెకండాఫ్
డైరెక్షన్

మొత్తానికి ‘ఓజి’ కోసం క్రేజీగా ఎదురుచూసిన ఆడియన్స్.. ‘క్యాజి’ సుజి(త్) అంటూ బయటకు వస్తారు. బాక్సాఫీస్ భారాన్ని పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ వీకెండ్ వరకు మోసే అవకాశం ఉంది. ఆ తర్వాత డౌటే.

OG Telugu Movie Rating : 2.25/5

Related News

Beauty Movie Review : ‘బ్యూటీ’ మూవీ రివ్యూ… బ్యూటీ కాదు స్కూటీ

Bhadrakaali Movie Review : భద్రకాళి రివ్యూ… అంతా ఒకే.. కానీ పేరే బాలేదు

KishkindhaPuri Movie Review: ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ : భయపెట్టింది.. అయినా ఫోన్ చూడాల్సి వచ్చింది

Mirai Movie Review : మిరాయ్ రివ్యూ – సూపర్ హీరో సూపర్ ఉందా ?

Mirai Twitter Review: ‘మిరాయ్’ ట్విట్టర్ రివ్యూ.. తేజా అకౌంట్ లో మరో బ్లాక్ బాస్టర్..?

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ రివ్యూ… లొరైన్ దంపతులకు పర్ఫెక్ట్ సెండాఫ్

Big Stories

×