E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/09/2025)               

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 28వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో  బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభ రాశి:

సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో  పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

మిథున రాశి:  

వాహనయోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన  పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటక రాశి:

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ముఖ్యమైన  పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు  నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  పని ఒత్తిడి  పెరుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

సింహరాశి:

ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన  పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా  ఉంటాయి.

కన్యారాశి :

కుటుంబ సభ్యులతో  గృహమున  ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన  పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన  ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చికరాశి:

కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంట్లో  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి  ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.

ధనస్సు రాశి:

నూతన రుణ యత్నాలు  చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరరాశి:

నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  వృత్తి  ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి.

కుంభరాశి:

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మీనరాశి:

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×