Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా సంజన బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. సంజనాను బయటకు పంపిస్తున్నప్పుడు చాలామంది ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఇంకొంతమంది ముసలి కన్నీళ్లు కార్చారు. మొత్తానికి అందరికీ బిగ్గెస్ట్ ట్విస్ట్ బిగ్ బాస్ ఇచ్చారు. సంజనాను ఒక సీక్రెట్ రూమ్ లో కూర్చుని పెట్టి హౌస్ మేట్స్ మాట్లాడుకునే మాటల్లో వినిపించారు.
అయితే అందరికంటే ఎక్కువగా రాము రాథోడ్ మాటలు విని సంజన షాక్ అయిపోయింది. ఆమె పెద్దవాళ్లని ఒకలాగా, చిన్నవాళ్లను మరొక లాగా ట్రీట్ చేస్తుంది అనే మాట సంజనాకు బాగా బాధ కలిగించింది. అలానే ఎమోషనల్ గా ఇమ్మానుయేల్ ప్రవర్తించిన తీరు తనకు కన్నీళ్లు పెట్టించింది.
ఇక వెళ్ళిపోయేముందు ప్రతి కంటెస్టెంట్ హౌస్ లో ఉన్న మెంబర్స్ గురించి మాట్లాడుతుంటారు. అదే తరహాలో అందరి గురించి సంజన మాట్లాడింది. ఎవరెవరు ఏమి మార్చుకోవాలో చెప్పింది. ముఖ్యంగా రాము రాథోడ్ కి నిన్ను ఎప్పుడు అలా ట్రీట్ చేశారో ఆ బిడ్డ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇవన్నీ మనకు ప్రోమోలో కూడా కనిపించాయి. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే హౌస్ మేట్స్ లో నలుగురు సహాయంతో మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సంజన.
ప్రతి వారం కూడా నాగార్జున వచ్చినప్పుడు హౌస్ మేట్స్ గురించి మాట్లాడటం అనేది కామన్. అలానే ఎవరిదైనా తప్పు కనిపిస్తే నాగార్జున ప్రతి వారం వచ్చి అడిగేసి కడిగేస్తారు. ఇక ఈ వారం కూడా కొంతమందికి వార్నింగ్స్ ఇచ్చారు. ముఖ్యంగా రాము రాథోడ్ కాఫీ గురించి మాట్లాడిన వివాదాన్ని, అలానే ఎవరి దగ్గర ఏ ఏ మాటలు మాట్లాడుతున్నాడు అని చూపించి మరి వార్నింగ్స్ ఇచ్చారు.
కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మాస్క్ మాన్ హరీష్. అయితే ఎక్కువగా మాస్క్ మెన్ హరీష్ హౌస్ మొత్తం లో నేనే తెలివైన వాడిని అనే ఆలోచనలో ఉంటాడు. ముఖ్యంగా నోరు జారి కొన్ని పదాలను అనేస్తుంటాడు. గతంలో రెడ్ ఫ్లవర్ అన్నందుకు హరీష్ కు నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. నేడు ఏకంగా లత్కోర్ హరీష్ అంటూ సంబోధించి ఆ పదం గురించి కూడా గట్టి వార్నింగ్ పీకారు.
విజయదశమి దగ్గర పడుతున్న సందర్భంగా టెనెంట్స్ మరియు ఓనర్స్ మధ్య ఒక టాస్క్ పెట్టారు. దీనికి న్యాయ నిర్ణీతగా దివ్య వ్యవహరించారు. ఇరు వర్గాలు విజయదశమికి సంబంధించిన ముగ్గులు వేశారు. దివ్య జడ్జిమెంట్ ప్రకారం టెనెంట్స్ గెలిచారు. వాళ్లకు మజా బాటిల్స్ లభించాయి. రేపు అఫీషియల్ ఎలిమినేషన్ జరగబోతుంది.
Also Read : Bigg Boss 9 : ఇది అసలైన రణరంగం,సుమన్ శెట్టి మీద ఒపీనియన్ పోతుంది