BigTV English

OTT Movie : సముద్రపు జీవుల్ని కంట్రోల్ చేసే మిస్టీరియస్ జీవి… వింత ద్రవంతో అంతులేని జబ్బు… పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్

OTT Movie : సముద్రపు జీవుల్ని కంట్రోల్ చేసే మిస్టీరియస్ జీవి… వింత ద్రవంతో అంతులేని జబ్బు… పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్

OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఊహించని సంఘటనలతో ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ నేపథ్యంలో 2023లో వచ్చిన ఒక జర్మన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇందులో పర్యావరణ నష్టానికి గాను, ఒక వింత సముద్ర జీవి రివేంజ్ తీర్చుకునే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇది ఒక విధ్వంసంలా సాగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది స్వార్మ్’ (The Swarm) 2023లో విడుదలైన జర్మన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఫ్రాంక్ షాట్జింగ్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. బార్బరా ఈడర్, లూక్ వాట్సన్, ఫిలిప్ స్టోల్జ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 2023 మార్చి 1 నుంచి అమెజాన్ ప్రైమ్, హులు, బింగే లో అందుబాటులో ఉంది. ఇందులో అలెగ్జాండర్ కరీమ్ (డాక్టర్ సిగుర్ జోహాన్సన్), సెసిల్ డి ఫ్రాన్స్ (డాక్టర్ సెసిల్ రోష్), లియోనీ బెనెష్ (చార్లీ వాగ్నర్), జోషువా ఓడ్జిక్ (లియోన్ అనావాక్) ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 8 ఎపిసోడ్‌లతో, IMDbలో 5.9/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ సముద్రంలో జరిగే వింత సంఘటనల చుట్టూ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుండి సముద్ర జీవులు మానవులపై దాడి చేయడం మొదలుపెడతాయి. తిమింగలాలు పడవలను నాశనం చేస్తుంటాయి. స్కాట్లాండ్‌లో చార్లీ వాగ్నర్ అనే సైంటిస్ట్ సముద్రంలో మీథేన్ బుడగలు కనిపెట్టి, ప్రొఫెసర్ కతారినాకు చెబుతుంది. కొన్ని మరణాలు విచిత్రంగా జరుగుతుంటాయి. అది విషపూరిత బాక్టీరియా వల్లే అని తెలుస్తుంది. ఇవి సముద్ర నీటిని పాడు చేస్తుంటాయి. మరోవైపు జెల్లీఫిష్ దాడులతో చామంది చనిపోతుంటారు. ఈ సంఘటనలన్నీ మానవుల వల్ల సముద్రాలకు జరిగిన నష్టానికి ప్రతీకారంగా ఒక తెలివైన సముద్ర జీవి చేస్తోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తారు.


ఈ సమస్యను ఆపడానికి శాస్త్రవేత్తలు ఒక బృందంగా ఏర్పడి, ఆర్కిటిక్ సముద్రంలో ఒక న్యూ టెక్నాలజీ ఓడలో వెళతారు. ఈ జీవిని ఎలాంటిదో కనిపెట్టి, దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కథలో సునామీలు, ప్రమాదకర బాక్టీరియా, సముద్ర జీవుల దాడులు ఉత్కంఠను కలిగిస్తాయి. ప్రతి శాస్త్రవేత్త ఈ విషయం మీద టెన్షన్ పడుతుంటారు. కొంతమంది ఈ రహస్యాన్ని చేధించడానికి జీవితాన్ని పణంగా పెడతారు. చివరికి ఈ విధ్వంసం ఎందుకు జరుగుతోంది ? దీనికి కారణం ఏమిటి ? దీన్ని ఎలా అపుతారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

OTT Movie : గత్యంతరం లేక కుక్కను నట్టనడి అడవిలో వదిలేస్తే… చివరికి అది చేసే పనికి దిమాక్ కరాబ్ మావా

OTT Movie: పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

OTT Movie : కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ … సోదరి మీదే రివేంజ్ … ఈ లవ్ స్టోరీ కూడా తేడానే

Big Stories

×