E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/09/2025)                

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/09/2025)                
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 30వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.  ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో  విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

వృషభ రాశి:

Advertisement

చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు  అంతంత మాత్రంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మిథున రాశి:  

వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో  కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

కర్కాటక రాశి:

Advertisement

సమాజంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో  అధికారులను ఆకట్టుకొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు మరింత  లాభసాటిగా సాగుతాయి.

సింహరాశి:

వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన   సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యారాశి :

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో  పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు  ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు  ఇస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా  సాగుతాయి. నూతన వ్యాపారాలు  ప్రారంభించక  పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి  వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికరాశి:

దైవ  కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.  వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  నిరుద్యోగ  ప్రయత్నాలు కొంత నిధానంగా  సాగుతాయి. 

ధనస్సు రాశి:

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత  అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో  విశేషమైన  లాభాలను పొందుతారు.

మకరరాశి:

దూర  ప్రయాణాలు వాయిదా పడతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో సమస్యలు.  ధన  పరంగా ఒడిదుడుకులు తప్పవు.  దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

కుంభరాశి:

చేపట్టిన పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. వృత్తి  వ్యాపారాలు అనుకూలముగా  సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి  అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్యలు  రాజీ చేసుకుంటారు.

మీనరాశి:

వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో  వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు  సద్వినియోగం చేసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×