BigTV English

Bigg Boss 9: సంజన పోపు ఘాటు దెబ్బకు తనూజ అవుట్.. మాస్క్ మ్యాన్ సైలెంట్ కౌంటర్..

Bigg Boss 9: సంజన పోపు ఘాటు దెబ్బకు తనూజ అవుట్.. మాస్క్ మ్యాన్ సైలెంట్ కౌంటర్..

Bigg Boss Telugu 9 Day 22: నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ హీట్ ఎలా ఉంటుందో ఆసక్తిగా చూస్తున్న ఆడియన్స్ కి సంజన పోప్ ఘాటుతో షోని మరింత రసవత్తరం చేసింది. హౌజ్ లో అందరిది ఒకమాట అయితే సంజనది మరో మాట. డే వన్ నుంచి ఆమె మాట, ఆట హౌజ్ మేట్స్ కి వ్యతిరేకంగానే ఉంటుంది. ఇక ఈ రోజు అంత పప్పుతో లంచ్ కి తిద్దామని వంట మొదలు పెట్టారు. సంజన మాత్రం తనకు ఎల్లిపాయ కారం కావాలని, పొప్ పెట్టుకుంటానంటూ మొదలు పెట్టింది. దీనికోసం ఫుడ్ మానిటర్ తనూజ దగ్గర పర్మిషన్ కూడా తీసుకుంది.


బిక్ష అడుక్కోవాలా?

వెల్లిపాయ, ఉల్లిగడ్డ లేదన్న.. ప్లెయిన్ పోప్ కావాలంది. చివరిక ఒకే అన్నాక.. అక్కడ ఫుడ్ వండే దివ్య.. ఏం చేయాలన్న తనకి ఫుడ్ మానిటర్ పర్మిషన్ కావాలని చెప్పింది. దీంతో అక్కడ వచ్చిన తనూజ దివ్య మాటలతో ఇంట్లో సరుకులన్ని తక్కువగా ఉన్నాయంది. చూసి పెట్టుకోండని చెప్పింది. ఆ తర్వాత టెనెంట్సే ఫుడ్ వండాలి కాబట్టి.. శ్రీజ చేయించుకుంటానంది. ఎవరితో చేయించుకున్న ఎల్లిపాయ, వెల్లుల్లి వాడొద్దని కండిషన్ పెట్టడంతో.. సంజన వాదనకు దిగింది. తనూజ, సంజన మధ్య మాట మాట పెరగడంతో.. నాకు బ్రేకఫాస్ట్ వద్దు.. అన్నం వద్దంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏమైనా కావాలంటే నిన్ను భిక్ష అడుక్కోవాలంటూ నోరుపారేసుకుంది. బెడ్ రూం వెళ్లి కూర్చోని కుళాయి తెరిచింది. ఫుడ్ కోసం ఇంతలా అడుక్కోవాలా.. ‘బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఫీలై జైళ్లో వేస్తానని అరుస్తావ్. పోపు విషయంలో మాత్రం మాట్లాడలేవు. ఎలాంటి కెప్టెన్ నువ్వు? నేను ఫుడ్ తినను’ అంటూ నిరాహార దీక్షకు దిగింది.

డిమోన్ పై మాటల దాడి

‘జైల్లో ఉన్నవాళ్ల గురించి అంతగా ఆలోచిస్తావు.. కానీ, ఇంట్లో వాళ్లని పట్టించుకోవు.. అదే నా స్థానంలో అమ్మాయి ఉండి ఉంటే తప్పకుండ నువ్వు స్టాండ్ తీసుకునేవాడివి’ అంటూ డిమోన్ పై అసహనం చూపించింది. అనంతరం భరణి, శ్రీజ, డిమోన్ లు సంజనని కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, సంజన మాత్రం తన పంతం తక్కించుకోలేదు. ఇంట్లో అసలు ఫుడ్ తిననంటూ.. అరేయ్ కళ్యాణ్ ఇక నుంచి నేను నీ ఫుడ్ తింటాను అంటూ కోపంగ అంటుంది. దీనికి పవన్.. ఓనర్స్ టెనెంట్స్ ఫుడ్ తినడానికి వీలు లేదని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో సంజన మళ్లీ కుళాయి విప్పింది. అంతే నా స్థానంలో రీతూ, శ్రీజ, తనూజలు ఉంటే నీకు ఏ ప్రాబ్లమ్ ఉండేది కాదు. అక్కడ నేను ఉన్నాను కాబట్టి నీకు ప్రాబ్లం అంటూ మళ్లీ డిమోన్ పై విరుచుకుపడింది. దీనికి ఇంట్లో ఎవరి ఫుడ్ వాళ్లే తినాలి. మీకు కెటాయించిన ఫుడ్ మీరు తినండి.. అది నచ్చకపోతే.. మా ఫుడ్ తినడంలో ప్రాబ్లమ్ లేదు.


పంతం నెగ్గించుకున్న సంజన

కానీ, ఆ తర్వాత మీలాగే అందరూ వస్తారు. వాళ్లందరికి మా టెనెంట్స్ ఫుడ్ ఇవ్వలేం కదా అని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ, డిమోన్ మాటలను వినిపించుకోకుండ.. డిమోన్ పై సంజన, ఫ్లోరాలు మాటల దాడికి దిగారు. ఆ తర్వాత ఇమ్మ్యునిటీ టాస్క్ లు కారణంగా ఈ ఘాటు కాస్తా తగ్గింది. కానీ, మళ్లీ రచ్చ మొదలెట్టింది సంజన. దివ్య, తనూజ, డిమోన్ వంట చేస్తే తాను తిననంటూ హౌజ్లో మళ్లీ ఘాటు పెంచింది. అంతేకాదు హరీష్ గారు వంట చేయాలని అనడంతో.. పది రోజులైంది స్నానం చేసి అంటూ సైలెంట్ గా ఇచ్చిపడేశారు.

నాలుగైదు రోజులుగా స్నానం చేయడం లేదు.. అలాగే ఫుడ్ వండుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్లాలంటే చచ్చాము అని సంజననానే.. హరీష్ ని మళ్లీ వంట చేస్తావా అని అడిగింది. దీనికి హరీష్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూనే వంట చేయనని చెప్పాడు. దీంతో ఫుడ్ మానిటర్ మారాలి.. దీనికి ఎవరూ అగ్రీ చేస్తారు అని సంజన ఓటింగ్ పెట్టింది. దీంతో ఫుడ్ మానిటర్ గా ఉంటే అదేలా ఉంటుందో సంజనకు తెలియాలని కెప్టెన్ డిమోన్ తెలివిగా ఆ బాధ్యతను సంజనకే అప్పగించాడు. దీనికి హౌజ్ మేట్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తనూజ తప్పుకుంది. దీంతో ఫుడ్ మానిటర్ బాధ్యతను సంజన తీసుకుంది. అయితే తనపై నిందలు వేయడం, అరవడంతో తనూజ కన్నీరు పెట్టుకుంది.

Related News

Bigg Boss 9: వారధి కట్టు.. ఇమ్మ్యూనిటీ పట్టు.. ట్విస్ట్ అదిరింది.. నామినేషన్స్ నుంచి వారిద్దరు సేవ్

Bigg Boss 9: మళ్లీ రచ్చ మొదలుపెట్టిన సంజన.. తినడానికి బిక్ష అడుక్కోవాలా?.. పాపం తనూజ

Bigg Boss 9 Promo: వారధి కోసం పోరాటం.. నెగ్గేదెవరు?

Bigg Boss 9 Promo: ఇమ్యూనిటీ స్టార్.. కష్టపడ్డా ప్రతిఫలం దక్కలేదే?

Bigg Boss 9: 3వారాలకు గానూ కామనర్ ప్రియాశెట్టి ఎంత రెమ్యూనరేషన్ పొందిందంటే?

Bigg Boss Buzzz : ప్రియా శెట్టిని కడిగిపడేసిన శివాజీ, నోరు తెరవనివ్వకుండా కౌంటర్లు

Bigg Boss 9 : ట్విస్ట్స్, ఎంటర్టైన్మెంట్స్ తో కలర్ ఫుల్ దసరా ఎపిసోడ్

Big Stories

×