BigTV English

OTT Movie : అందం కోసం అరాచకం… మనిషి మాంసాన్ని మటన్ లా తినే ఊరు… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : అందం కోసం అరాచకం… మనిషి మాంసాన్ని మటన్ లా తినే ఊరు… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : హారర్ సినిమాలు రకరకాల కథలతో ఆడియన్స్ ని భయపెట్టడానికి వస్తున్నాయి. ఓటీటీలో ఇలాంటి సినిమాలకు కొదవ లేదు. అయితే కొన్ని సినిమాల కంటెంట్ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక నటి చుట్టూ తిరుగుతుంది. ఆమె అందం కోసం ప్రెగ్నెంట్ మహిళల పిండాలను వాడుతుంటుంది. ఈ సీన్స్ ఒళ్ళు జలదరించేలా చేస్తుంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళ్తే


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Dumplings’ 2004 ఆగస్టు 4న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయిన హాంగ్ కాంగ్ హారర్ సినిమా. 2004 అక్టోబర్ లో ఈ సినిమా థియేటర్లలో లో విడుదలైంది. దీనికి ఫ్రూట్ చాన్ దర్శకత్వం వహించారు. ఇందులో బై లింగ్, మిరియం యంగ్, టోనీ లియంగ్ కా-ఫై ప్రధాన పాత్రల్లో నటించారు. 91 నిమిషాల రన్‌టైమ్‌తో, ఈ సినిమా IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

మిసెస్ లీ ఒక మాజీ టీవీ నటి, తనకి వయసు పెరుగుతుండటంతో తన అందం కూడా తరిగిపోతుంటుంది. ఆమె భర్త మిస్టర్ లీతో ప్రేమను పొందాలని కోరుకుంటుంది. ఎందుకంటే అతను ఒక వయసులో ఉన్న మసాజ్‌ గర్ల్ తో ఎఫైర్‌లో ఉంటాడు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆమె మీ అనే ఒక మాజీ గైనకాలజిస్ట్ ను కలుస్తుంది. ఆమె తన అబార్షన్ క్లినిక్ లో, యవ్వనంగా ఉండటానికి ఒక మందు కనిపెడుతుంది. అది అబార్షన్ కి వచ్చే మహిళల పిండాలను తెసుకుని, దాని ద్వారా ఒక మందు కనిపెడుతుంది. మొదట మిసెస్ లీ ఈ పదార్థాన్ని చూసి భయపడి పారిపోతుంది. కానీ తన భర్త దృష్టిని తిరిగి ఆకర్షించడానికి మళ్ళీ వస్తుంది. ఈ మందును తినడం మొదలు పెడుతుంది. ఆంట్ మీ కూడా 64 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ, దీనిని తినడం వల్ల 30 ఏళ్ల వయస్సు లాగా కనిపిస్తుంది.


ఇది చూసి మిసెస్ లీ మరింత ఇంప్రెస్ అవుతుంది. మిసెస్ లీ ఇప్పుడు వయసులో ఉన్న అమ్మాయిలా కనబడుతుంది. చాలా రోజుల తరువాత ఆమె భర్తతో తనతో సన్నిహితంగా గడుపుతాడు. కానీ ఆమె శరీరం నుండి చేపల వాసన వస్తుందని ఆమె స్నేహితులు గమనిస్తారు. మిసెస్ లీ మరింత శక్తివంతమైన మందుల కోసం ఆంట్ మీని ఒత్తిడి చేస్తుంది. ఈ సమయంలో మీ ఒక ఐదు నెలల గర్భవతి అయిన కేట్ అనే అమ్మాయికి అబార్షన్ చేస్తుంది. ఆమె తన తండ్రి వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ శిశువు నుండి తయారైన మందు మిసెస్ లీ పై బాగా ప్రభావాన్ని చూపుతుంది. కానీ కేట్ అబార్షన్ తర్వాత రక్తస్రావంతో మరణిస్తుంది.

ఇంతలో మిస్టర్ లీ కూడా మీ తయ్యారు చేసే మందుని తినడం ప్రారంభిస్తాడు. మీ తో ఎఫైర్‌లో కూడా పడతాడు. మె వయస్సు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. వీళ్ళంతా ఈ మాయలో చిక్కుకుపోతారు. చివరికి ఈ సినిమా ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ మలుపు ఏమిటి ? వీళ్ళు దీని నుంచి బయట పడతారా ? ఆ పిండాల మందు వీళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

Related News

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

OTT Movie : కూతురి ఫోన్లో అలాంటి వీడియోలు… తండ్రి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ భయ్యా

OTT Movie : భర్త చేతగానితనం… భార్యపై కన్నేసే మరిది… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : పందుల పైశాచికం… మనుషుల్ని పీక్కుతినే విడ్డూరం… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు మావా

OTT Movie : మొగుడి వల్ల కావట్లేదని… హోటల్ గదిలో మరొక వ్యక్తితో… ఫ్యామిలీతో కలిసి చూడకూడని మూవీ భయ్యా

OTT Movie : గడ్డివాములో గందరగోళం… పిల్లాడికి హెల్ప్ చెయ్యడానికి వెళ్లి ట్రాప్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×