E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (08/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (08/09/2025)
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 8వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:

ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభ రాశి:

Advertisement

స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  ముఖ్యమైన వ్యవహారాలలో  సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావలసిన సోమ్ము అందుతుంది. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగపరంగా  అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మిథున రాశి:  

ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

కర్కాటక రాశి:

Advertisement

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలొ హోదాలు పెరుగుతాయి.

సింహరాశి:

ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్యారాశి :

సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు  అనుకూలస్తాయి. బంధు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున  శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వ్యాపార వ్యవహారాలు  ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం  ఉంటుంది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఉద్యోగమున సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

వృశ్చికరాశి:

ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.

ధనస్సు రాశి:

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. విద్యార్దులు మరింత కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  సంతాన  వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి.

మకరరాశి:

ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ముందుకు సాగడం మంచిది.

కుంభరాశి:

బంధు మిత్రులతో  సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

మీనరాశి:

దూరప్రాంతాల బందువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ  విషయంలో శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచన జ్ఞానంతో  ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×