BigTV English

OTT Movie : పోలీస్ వ్యవస్థపై పగతో హత్యలు… శవాల దగ్గర కవితలు వదిలేసి హింట్ ఇచ్చే సీరియల్ కిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్

OTT Movie : పోలీస్ వ్యవస్థపై పగతో హత్యలు… శవాల దగ్గర కవితలు వదిలేసి హింట్ ఇచ్చే సీరియల్ కిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్

OTT Movie : బెంగాలీ సినిమా చరిత్రలోనే థ్రిల్లర్ జానర్‌ను అద్భుతంగా చూపించిన ఒక మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా 41 అవార్డులను గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. ఇందులో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో అనుపమ్ రాయ్‌కి “ఎక్‌బర్ బోల్” పాటకు బెస్ట్ అప్‌కమింగ్ లిరిసిస్ట్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బెస్ట్ ఫిల్మ్ ఆల్బమ్ వంటివి ఉన్నాయి. జీ బంగ్లా గౌరవ్ అవార్డ్స్‌లో 13 నామినేషన్ల నుండి 9 అవార్డులు. అంతర్జాతీయ బంగ్లా ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‌ప్లే, గౌతమ్ ఘోస్‌కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చాయి. రైమా సేన్ షోయిలోజనందో ముఖోపాధ్యాయ మెమోరియల్ అవార్డ్ గెలుచుకుంది. వరుస హత్యల కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఈ స్టోరీ ఊహకందని ట్విస్టులతో నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివారాల్లోకి వెళ్దాం పదండి.


స్టోరీలోకి వెళ్తే

కోల్‌కతాలో వరుస హత్యలు జరుగుతుంటాయి. హంతకుడు ప్రతి హత్య దగ్గర బెంగాలీ కవిత్వం నుండి కొన్ని పంక్తులు ముద్రించిన కాగితాన్ని వదిలేస్తాడు. ఈ కేసును ఛేదించడానికి అభిజిత్ పక్రాశి అనే పోలీస్ ఆఫీసర్ ప్రయత్నిస్తాడు. కానీ ఏమాత్రం పురోగతి కనిపించదు. అతని సీనియర్ సలహాతో, సస్పెండ్ అయిన మాజీ పోలీసు అధికారి ప్రొబీర్ రాయ్ చౌధురీ సహాయం తీసుకుంటాడు. ప్రొబీర్ ఒకప్పుడు క్రూరమైన పద్ధతులతో నేరస్తులను ఎన్ కౌంటర్ చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ కేసులో తన నైపుణ్యాన్ని ఉపయోగిస్తాడు. ఈ హత్యల వెనుక హంగ్రీ జనరేషన్ కవులైన జిబనానంద దాస్, బినోయ్ మజుందార్, శక్తి చటోపాధ్యాయ వంటి వ్యక్తుల కవిత్వంతో సంబంధం ఉందని తెలుస్తుంది.

అభిజిత్, ప్రొబీర్ కలిసి కేసును ఛేదిస్తూ, నిబరణ్ చక్రవర్తి అనే ఒక కవి మీద అనుమానం పడతారు. అతను హంగ్రీ జనరేషన్ ఉద్యమంలో కీలకంగా ఉంటాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హత్యల వెనుక ఉన్న నిజం బయటపడుతుంది. ప్రొబీర్ స్వయంగా ఈ హత్యలకు మాస్టర్‌మైండ్‌గా ఉంటాడు. తన అనుచరుడు కనై ద్వారా హత్యలు చెపిస్తుంటాడు. పోలీసు శాఖలో తన సస్పెన్షన్‌కు ప్రతీకారంగా ఈ పని చేస్తాడు. చివర్లో అభిజిత్ తనని తదుపరి లక్ష్యంగా భావిస్తాడు. కానీ ప్రొబీర్ తనను తాను హంతకుడిగా భావించి, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సినిమా ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్‌తో ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ప్రొబీర్ ఆత్మహత్య చేసుకుంటాడా ? అభిజిత్ కి అసలు విషయం తెలుస్తుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.


ఏ ఓటీటీలో ఉందంటే 

‘బైశే శ్రాబోన్’ (Baishe Srabon) సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఒక బెంగాలీ నీయో-నోయిర్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కోల్‌కతాలో జరిగే సీరియల్ కిల్లింగ్స్ చుట్టూ తిరిగే కథతో, బెంగాలీ సాహిత్యం, కవిత్వం, క్రైమ్ డ్రామాను అద్భుతంగా మేళవించింది. ఇందులో ప్రొసెన్‌జిత్ చటర్జీ, పరమ్‌బ్రత చటర్జీ, రైమా సేన్, అబిర్ చటర్జీ, మరియు గౌతమ్ ఘోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా హోయ్‌చోయ్ (Hoichoi), జియోహాట్‌స్టార్ (JioHotstar), అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హోయ్‌చోయ్‌లో ఈ సినిమా బెంగాలీ భాషలో అందుబాటులో ఉంది, మిగతా ప్లాట్‌ ఫామ్‌లలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. ఉచిత స్ట్రీమింగ్ ఆప్షన్స్ ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ ఈ ప్లాట్‌ఫామ్‌లలో సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు.

Read Also : పుట్టినరోజునే బలి… బర్త్ డేను డెత్ డే చేసే మాస్క్ కిల్లర్… టైం లూప్ లో చచ్చి బతుకుతూ… లాస్ట్ ట్విస్ట్ అదుర్స్

Related News

OTT Movie : టాయిలెట్ కు వెళ్లి తిరిగిరాని లోకాలకు… ఈ మిస్టరీ డెత్ కు వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ రీజన్

OTT Movie : గ్రామంలో ఏ మహిళనూ వదలని దొర… పనోడితో దొర పెళ్ళాం… ఈ అరాచకం మాములుగా ఉండదు భయ్యా

OTT Movie : లాడ్జిలో అమ్మాయి హత్య… మంచానికి చేతులు కట్టేసి ఆ పాడు పని… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సిరీస్ మావా

OTT Movie : ధూమ్ ధామ్ గా పెళ్లి… మొదటి రాత్రే జీవితంలో పెళ్ళంటేనే భయపడే షాక్ ఇచ్చే భార్య… తేడా యవ్వారమే

OTT Movie : వేరే వ్యక్తి భార్యను ఇంటికి తీసుకొచ్చి… మైండ్ బెండయ్యే ట్విస్టులు… మస్ట్ వాచ్ బెంగాలీ రొమాంటిక్ డ్రామా

Big Stories

×