ఈ మధ్యకాలంలో ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే చాలావరకు లోన్ యాప్స్ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తగానే వెంటనే ఈ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని, లోన్ తీసుకున్న తర్వాత . చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారు. ముఖ్యంగా కొన్ని లోన్ యాప్స్ కారణంగా రుణాలు పొందిన వారు ఆత్మహత్య సైతం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలతో పాటు, సైబర్ క్రైమ్ కార్యకలాపాలు సైతం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో లోన్ యాప్స్ చట్టబద్ధత పైన కూడా చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. నిజానికి లోన్ యాప్స్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా, చాలామంది కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే సులభమైన కేవైసీ చెకింగ్ ద్వారా రుణాలు పొందే ఈజీ మెథడ్. కానీ కొన్ని లోన్ యాప్స్ చేస్తున్నటువంటి దురాగతాల వల్ల లోన్ యాప్స్ చట్టబద్ధమేనా? కాదా అనే సందేహం కలుగుతోంది.
నిజానికి లోన్ యాప్స్ నడపడానికి పలు బ్యాంకులకు ఆర్బిఐ అనుమతి అందించింది. దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు లోన్ యాప్స్ నడిపేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల ఫైనాన్షియల్ టెక్నాలజీని విరివిగా విస్తరించేందుకుగాను బ్యాంకు వ్యాపారాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావించారు. కానీ కొంతమంది సైబర్ నేరగాళ్ల వికృత చేష్టల కారణంగా లోన్ యాప్స్ అమాయకులకు యమపాషాలుగా మారుతున్నాయి.
ప్రస్తుతం చట్టబద్ధమైన లోన్ యాప్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
RBI అనుమతితో పనిచేసే లోన్ యాప్స్ ఇవే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుమతి ఉన్న NBFCs నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, షెడ్యూల్డ్ బ్యాంక్స్ ద్వారా నడిచే యాప్స్ చట్టబద్ధం అని చెప్పవచ్చు. ఇవన్నీ RBI రెగ్యులర్‌గా మానిటర్ చేస్తుంది.వీటిలో SBI YONO, HDFC, ICICI, Axis Bank, Kotak మొదలైన బ్యాంకులు తమ యాప్స్ ద్వారా కస్టమర్లు సులభ కేవైసీ ద్వారా లోన్స్ అందిస్తాయి.
>> అలాగే పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సైతం యాప్స్ ద్వారా లోన్స్ అందజేసేందుకు ఆర్బిఐ అనుమతి ఇచ్చింది. వీటిలో Bajaj Finserv, Tata Capital, Paytm Postpaid, Lazypay, KreditBee లాంటి RBI రిజిస్టర్డ్ NBFC యాప్స్ ఉన్నాయి.
ఇల్లీగల్ లోన్ యాప్స్ – ఎలా గుర్తించాలి?
RBI లైసెన్స్ లేని యాప్స్ ను గుర్తించేందుకు ముందుగా RBI వెబ్‌సైట్‌లో NBFCల లిస్ట్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లిస్టులో లేని కంపెనీ నుంచి లోన్ తీసుకోవడం చాలా వరకూ రిస్క్ అని చెప్పవచ్చు. ఇందులో కొన్ని చైనీస్ కంపెనీలు సైతం ఉండే అవకాశం ఉంటుంది. ఈ యాప్స్ అధిక వడ్డీరేట్లను వసూలు చేయడంతో పాటు, మీ ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని సైతం చౌర్యం చేసేందుకు వెనుకాడవు.
ఆర్బీఐ రూల్ ప్రకారం బ్యాంకులు గరిష్టంగా సాధారణంగా వార్షిక వడ్డీ (Annual Interest Rate) 10–24%లోపే వసూలు చేస్తాయి.
>> అవసరానికి మించి డేటా యాక్సెస్ కాంటాక్ట్స్, ఫోటోలు, సోషల్ మీడియా యాక్సెస్ అడిగితే అవి ఇల్లీగల్ యాప్స్ గా గుర్తించాలి. చట్టబద్ధమైన యాప్స్ కేవలం KYC (ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్) మాత్రమే అడుగుతాయి.
>> కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియాలో అవమానించడం, బెదిరించడం చేస్తే, అవి అక్రమ యాప్ కింద చూడాలి.
>> సందేహాస్పద యాప్‌ను వెంటనే ప్లే స్టోర్ లో రిపోర్ట్ చేయండి RBI పోర్టల్ లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ (cybercrime.gov.in)లో కంప్లయింట్ ఇవ్వండి.