E-Paper
Advertisement

Ugadi panchangam 2026: మేష రాశికి ఈ సంవత్సరం అదృష్టమే అదృష్టం

Ugadi panchangam 2026: మేష రాశికి ఈ సంవత్సరం అదృష్టమే అదృష్టం
Advertisement

Ugadi panchangam 2026: పరాభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి అదృష్టం వరించబోతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం మేష రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉంటే విజయం వరిస్తుందని చెప్తున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5 గానూ ఉన్నాయి.. ఇక రాజపూజ్యం 2, అవమానం 4 గానూ ఉన్నాయి. ఈ రాశిలో మొత్తం మూడు నక్షత్రాలు ఉంటాయి. అందులో అశ్వని నక్షత్రం నాలుగు పాదాలు.. చూ,చే,చో,లా అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వాళ్లు.. అలాగే భరణి నక్షత్రం నాలుగు పాదాలు.. పేరు లీ,లూ,లే,లో అనే అక్షరాలతో మొదలయ్యే వారు.. ఇక  కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఈ రాశిలోకి వస్తుంది.  ఈ సంవత్సరం ఏలినాటి శని ఉన్నప్పటికీ  రాహువు ఈ సంవత్సరం అంతా శుభమే ఇస్తాడట.

ఉద్యోగం, కేరీర్‌:

ఈ సంవత్సరం మేష రాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు కూడా ఆలస్యంగా వస్తుంది. ఈ రాశి ఉద్యోగులకు కోరుకున్న ట్రాన్స్‌ఫర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం ఉంటున్న ప్లేస్‌ను మారే అవకాశాలు ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితి:

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి అర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆదాయం కూడా ఆశించిన దాని కంటే ఎక్కువే వస్తుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఇక పెట్టుబడులు పెట్టే సమయంలో నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సంవత్సరం పొదుపు మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి.

ఆరోగ్యం:

ఈ ఉగాది తర్వాత మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మానసికమైన ఆందోళన ఏర్పడుతుంది. నిద్రలేమితో బాధపడే అవకాశం ఉంది. కాళ్లు లేదా కంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. యోగా, ధ్యానం చేయడం మంచిది.

కుటుంబం:

Advertisement

మేష రాశి జాతకులు ఈ పరాభవ నామ సంవత్సరంలో కుటుంబ పరంగా చూస్తూ.. మొదటి ఆరు నెలలు మామూలుగానే ఉంటుంది. కానీ తర్వాత ఆరు నెలల కాలం చాలా బాగుంటుంది. ద్వితీయార్థంలో కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రెండవ ఆరునెలల్ల చాలా కలిసి వస్తుదని పండితులు చెప్తున్నారు.

పరిహారాలు:

మేష రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఏలినాటి శని నడుస్తుంది. అందుకోసం వీళ్లు హనుమాన్‌ చాలీసా పారాయణ చేసుకోవాలి. అలాగే శనివారాల్లో శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోవాలి. బీదవారికి అన్నదానం చేయాలి. అలాగే దానధర్మాలు చేయాలి. శని స్తోత్రం పారాయణం చెయ్యాలి. సుబ్రమణ్య స్వామి ఆరాధనా నిత్యం చెయ్యాలి మంగళవారం 1 ¼ kg కందులు దానంగా ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. .

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ సంవత్సరం మీనరాశికి రాజయోగమే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×