E-Paper
Advertisement

Ugadi panchangam 2026: కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని మార్పులు

Ugadi panchangam 2026: కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని మార్పులు
Advertisement

Ugadi panchangam 2026: కన్యా రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయట. ఈ సంవత్సరం వీరికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. జూన్ 2026 తర్వాత వ్యాపారం, ఉద్యోగాల్లో ఈ రాశి జాతకులకు మంచి లాభాలు వస్తాయట. అలాగే స్థిరాస్తి యోగం కూడా ఉందట. ఈ సంవత్సరం ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుందట. ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న అనారోగ్య సమస్యలు సమసిపోతాయట. ఇంకా చెప్పాలంటే..  ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందట. కానీ ఖర్చులు చేయడంలో నియంత్రణ పాటించాలని.. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ రాశి వారికి సప్తమంలో శని ఉన్నందున్న ప్రథమార్థంలో భాగస్వామ్య సమస్యలు వస్తాయి. అయితే ద్వితీయార్థంలో గురుబలం ఉండటం చేత అద్బుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి.

ఈ రాశిలోకి ఉత్తరా నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు.. పే, పో, షా అనే అక్షరాలు పేరు గల వ్యక్తులు… హస్త నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు.. పూ, ష, ణా, ఠా అనే అక్షరాలు పేరు గల వ్యక్తులు ఇంకా చిత్త నక్షత్రం ఒకటి, రెండు పాదాలు.. పే, పో అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈ రాశిలోకి వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3 గా ఉన్నాయి.

కేరీర్‌ అండ్‌ ఉద్యోగం:

Advertisement

ఈ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో పనిభారం పెరుగుతుంది. సంవత్సరం ప్రథమార్థంలో పార్టనర్‌ షిప్‌ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని గొడవలు అయి వ్యాపారంలో నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ద్వితీయార్థంలో ఈ రాశి వారికి భారీ ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు కోరుకున్న ప్రమోషన్లు లభిస్తాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి.

ఆర్థిక పరిస్థితి:

ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొదట్లో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జూన్‌ తర్వాత వ్యాపారంలో భారీ లాభాలు అందుకుంటారు. అలాగే పాత బాకీలు వసూలు అవుతాయి.

ఆరోగ్యం:

Advertisement

కన్యారాశి జాతకులు ఈ పరాభవ నామ సంవత్సరంలో కొన్ని అనారోగ్య సూచనలు ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు.. నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే బద్దకం పెరిగిపోతుందట. అందుకోసం వ్యామాయం ప్రతిరోజూ తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు.

కుటుంబం మరియు సంబంధాలు:

ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో గొడవలు పడకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అవగాహన చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అయితే వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అవుతుందట. అయితే చివర్లో వివాహం అవుతుందట.

పరిహారాలు:

ఈ రాశి వారు మరింత మంచి కోసం గణపతికి గరిక సమర్పించి పూజలు చేయాలట. అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలట. ఇంకా శనివారం అన్నదానం చేయాలని సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: సింహ రాశికి ఈ సంవత్సరం లైఫ్‌ టర్నింగ్‌ అవ్వడం పక్కా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×