E-Paper
Advertisement

Ugadi panchangam 2026: కుంభ రాశి వారు ఈ సంవత్సరం కోల్పోయింది తిరిగి పొందుతారు

Ugadi panchangam 2026: కుంభ రాశి వారు ఈ సంవత్సరం కోల్పోయింది తిరిగి పొందుతారు
Advertisement

Ugadi panchangam 2026: పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి అద్భుతమైన అభివృద్ధి ఉంటుందట. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే వృత్తిపరమైన పురోగతి ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పరీక్షా సమయం అని చెప్పాలి. ఏలినాటి శని ఉండటం చేత ఖర్చులు అధికంగా చేయాల్సి వస్తుందట. అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. ఇక ప్రథమార్థంలో గురుబలం కొంత ఊరట కలిగిస్తుందట. ఇక ద్వితీయార్థంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయట. అలాగే ఈ ఏడాది కొత్త మలుపులు, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయట. ఏలినాటి శని చివరి దశలో ఉన్నప్పటికీ, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందట. అలాగే కఠినమైన ప్రణాళికలతో విజయం సాధిస్తారట.

ఈ రాశిలోకి ధనిష్టా నక్షత్రం మూడు, నాలుగు పాదాలు.. శతభిష నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాల జాతకులు.. పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి, రెండు, మూడు పాదాల జాతకులు వస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2 గానూ ఉందట.

కేరీర్ అండ్‌ ఉద్యోగం:

Advertisement

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో కేరీర్‌లో మంచి గుర్తింపు వస్తుందట. కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తారట. కానీ ద్వితీయార్థంలో మాత్రం తీవ్రమైన ఒత్తిడి ఉంటుందట. చేస్తున్న పనులలో పోటీ అధికంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే విదేశీయోగం మాత్రం ఊరట కలిగించే అంశంగా పండితులు చెప్తున్నారు.

ఆర్థిక పరిస్థితి:

కుంభ రాశికి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఆర్థికరపమైన సమస్యలు ఖర్చుల విషయంలోనే ఉంటాయని పండితులు చెప్తున్నారు. మెడికల్‌ మరియు ప్రయాణ విషయంలోనే అధికంగా అప్పులు చేసే అవసరం వస్తుందట. ఈ రాశి వారు పొదుపు చేయడం కష్టంగా ఉంటుందట. అయితే ఎన్ని ప్రాబ్లమ్స్‌ వచ్చినా అప్పులు చేయవద్దని.. పెట్టుబడులు పెట్టవద్దని సూచిస్తున్నారు పండితులు.

ఆరోగ్యం:

Advertisement

ఈ రాశి వారికి ఈ సంవత్సరం మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుందట. అలాగే నిద్రలేమితో బాధపడతారట. ఇక పాదాలు లేదా కంటి సమస్యలు వేధిస్తాయట. ఇక సంవత్సరం ద్వితీయార్థంలో పొట్ట సమస్యలు వస్తాయట. ఈ రాశి వారు యోగా చేయడం తప్పనిసరిగా చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు.

కుటుంబ అభివృద్ది:

కుంభ రాశి వారికి ఈ సంవత్సరం జీవిత భాగస్వామితో అపార్థాలు వచ్చే అవకాశం ఉందట. అలాగే గొడవలు జరిగే సూచనలు ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో పిల్లల అభివృద్ది సంతోషం కలిగిస్తుందట.

పరిహారాలు:

ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతి రోజూ హనుమాన్‌ చాలీసా పారాయణ చేసుకోవాలని.. లేదా సుందరకాండ పారాయణ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే సోమవారం శివాలయంలో పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలట. ఇక శనివారం పేదలకు ఏదైనా దానం చేయాటల.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ సంవత్సరం మీనరాశికి రాజయోగమే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×