E-Paper
Advertisement

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!
Advertisement

Voter List Revision: స్వేచ్చ బ్యూరో: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. రెండు నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే 100% పూర్తయింది ఓటర్లు పూర్తిచేసిన ఏన్యూమరేషన్ ఫారాలను తిరిగి బిఎల్ఓలకు సమర్పిస్తున్నారు.వాటి వివరాలను అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేపడుతున్నారు. మొదట ఈనెల 24 వ తేదీ వరకు గడువు ఉండగా రాష్ట్రంలో 100% ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించింది.

100% ఫారాల పంపిణీ పూర్తి

సర్ ప్రక్రియలో భాగంగా ఏ న్యూమరేషన్ పారాల పంపిణీ జిల్లాలో 100% పూర్తయింది. మొదట్లో ఓటర్లు నమోదు ప్రక్రియ మందకోడిగా జరగడంపై జిల్లా కలెక్టర్ రివ్యూ చేపట్టి వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.వాటిని జిల్లా వ్యాప్తంగా ఆదివారం వరకు 78% డిజిటలైజేషన్ ప్రక్రియను బిఎల్వోలు పూర్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 5.03 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. గద్వాలలో 2.61 లక్షలు అలంపూర్ లో 2.42 లక్షల మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు.

Advertisement

Also read: Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

కొత్త కోడళ్ళు ఓటు జాగ్రత్త 

జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియలో ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ఓటర్ల పైనే ఉంది. ప్రధానంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చిన వారిపై అధికంగా ప్రభావం చూపుతోంది. ప్రధానంగా 2002 తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలు ఇంటిపేరు మారుతుంది.కానీ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ వారి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తుంది.2002లో సర్ ప్రక్రియలో ఏ నియోజకవర్గంలో ఉన్నారో స్పష్టంగా ఎన్యూమరేషన్ పత్రాలో నమోదు చేయాలి.తమ తల్లిదండ్రుల ఓటర్ జాబితా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.ఇతర రాష్ట్రాల నుంచి కోడలుగా వచ్చిన యువతుల వివరాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చదువుకున్న వారు గతంలో ఓటు హక్కు వివరాలు తెలిసిన వారైతే నమోదు చేస్తున్నారు. వివరాలు తెలియని నిరక్షరాసులకు ఇబ్బందికరంగా మారుతోంది.

స్వగ్రామాలలో ఓటు నమోదుకే ఆసక్తి

Advertisement

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపడుతున్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలలో నివాసం ఉంటున్న వారు రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఈ క్రమంలో వారికి అటు పట్టణం ఇటు సొంత గ్రామాలలో ఫారాలను పంపిణీ చేశారు. ఒక వ్యక్తి ఒకే ఓటును నమోదు చేసుకునేలా ఎన్నికల సంఘం యాప్ ను రూపొందించింది. ఈ నేపథ్యంలో స్వగ్రామాలలో భూములు, ఇల్లు ఉన్నదృష్ట ఊరిపై మమకారంతో గ్రామీణ ప్రాంతాలలో ఓటు హక్కును కలిగి ఉండేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నిర్ణయాలతో అటు ఓటర్లకు రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఓట్ల నమోదు పై స్పష్టత రానుంది.

Also Read: Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×