E-Paper
Advertisement

Malinga Angry on Dasun Shanaka: కొంప‌ముంచిన వైడ్ బాల్‌..శ్రీలంకపై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, షనకాకు క్లాస్ పీకిన మ‌లింగ‌

Malinga Angry on Dasun Shanaka: కొంప‌ముంచిన వైడ్ బాల్‌..శ్రీలంకపై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, షనకాకు క్లాస్ పీకిన మ‌లింగ‌
Advertisement

Malinga Angry on Dasun Shanaka:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament )  భాగంగా శనివారం కీలక మ్యాచ్ జరిగింది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka)  మధ్య సూపర్ 8 మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ పల్లెకెలే వేదికగా ( Pallekele International Cricket Stadium, Pallekele) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. ఇందులో భారీ తేడాతో గెలవాల్సిన పాకిస్తాన్ చేతులెత్తేసింది. శ్రీలంకకు విరాళంగా పరుగులు ఇచ్చి, సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాన్ని చేజేతుల చేజార్చుకుంది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో చివరి బంతిని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది సంధించాడు. ఆ సమయంలో చివ‌రి బంతికి ఆరు పరుగులు చేయాలి. కానీ షాహీన్ అఫ్రిది వైడ్ ( Wide ball controversy ) వేస్తాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వ‌డు. దీంతో ఆ వైడ్ గురించి రివ్యూ తీసుకోకుండానే శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకా ( Dasun Shanaka) మ్యాచ్ ఓడిపోయిందని వచ్చేస్తాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శ‌ర్మకు ఘోర అవ‌మానం…చెప్పులు చూపించిన యువ‌రాజు

వైడ్ బాల్ వివాదం..శ్రీలంక ఫిక్సింగ్ చేస్తుందని వార్తలు

Advertisement

శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య పల్లె కెలె వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 212 పరుగులు సాధించింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఓపెనర్లు ఫర్హాన్ అలాగే జమాన్ ఇద్దరు అదరగొట్టారు. అయితే చేజింగ్ చేసే క్రమంలో శ్రీలంక కూడా అద్భుతంగా ఆడింది. 147 పరుగుల లోపు శ్రీలంకను కట్టడి చేయాల్సి ఉండగా.. పాకిస్తాన్ బౌలర్లు తేలిపోయారు. దీంతో సెమీ ఫైనల్ అవకాశం కోల్పోయింది పాకిస్తాన్. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ చివర వరకు శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకా ( Dasun Shanaka) అద్భుతంగా ఆడాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో చివరి బంతి షాహీన్ అఫ్రిది సంధించాడు. ఆ సమయానికి ఆరు పరుగులు కావాలి. కానీ బంతి వైడ్ లైన్ పై నుంచి వెళ్తుంది. అంపైర్ మాత్రం వైడ్ ఇవ్వడు. అప్పుడు కచ్చితంగా ఏ ఆటగాడు అయినా రివ్యూ తీసుకుంటాడు. కానీ శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకా ( Dasun Shanaka) రివ్యూ తీసుకోకుండా మ్యాచ్ ఓడిపోయినట్లు వచ్చేస్తాడు. రివ్యూ తీసుకుని ఉంటే శ్రీలంక గెలిచేదని ఇప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు.

డ్రెస్సింగ్ రూమ్ లో దాసున్ షనకాకు క్లాసు పీకిన మలింగ

వైడ్ బాల్ వివాదం నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకాకు బౌలింగ్ కోచ్ మలింగా క్లాస్ పీకాడు. డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న దాసున్ షనకాను నిలదీస్తూ… రివ్యూ తీసుకుంటే సరిపోయేది… అది కంప్లీట్ గా వైట్ బాల్ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే దానికి దాసున్ షనకా బాధ్యత వహిస్తూ సైలెంట్ గా ఉండిపోయాడు. తనదే తప్పు అన్నట్లుగా వ్యవహరించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Also Read: Rinku Singh’s father dies: రింకూ ఇంట విషాదం..టీమిండియా ప్లేయ‌ర్లకు అసలు సిగ్గుందా..రీల్స్ చేస్తూ చేస్తారా?

 

 

?utm_source=ig_web_copy_link

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×