ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (నవంబర్ 23 – నవంబర్ 29) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం మీరు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఈ వారం మీకు దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు తీసుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరతాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఈ వారం మీరు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభసూచన లున్నవి. గణేశాష్టకం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.
ఈ వారం మీకు ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తగ్గుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. కనకధారా స్తోత్రం పారాయణ చేయుటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఈ వారం మీరు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఈ వారం మీరు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నవగ్రహ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
ఈ వారం మీరు స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. హయాగ్రీవ స్వామి స్తోత్రం పారాయణ చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఈ వారం మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబం వాతావరణం చికాకుగా ఉంటుంది. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను ఫలితాలు.
ఈ వారం మీకు సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. మధురాష్టకం పారాయణం చేయటం వలన శుభఫలితాలు పొందుతారు.
ఈ వారం మీరు నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.