E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 2 – నవంబర్‌ 8)  ఆ రాశి వారికి అదనపు ఆదాయం – వారికి ధనపరమైన ఇబ్బందులు

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 2 – నవంబర్‌ 8)  ఆ రాశి వారికి అదనపు ఆదాయం – వారికి ధనపరమైన ఇబ్బందులు

Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (నవంబర్‌ 2 – నవంబర్‌ 8) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. జీవిత బాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.   

వృషభ రాశి: 

చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆలోచనలో ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.  

 మిథున రాశి: 

కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

కర్కాటక రాశి:

నిరుద్యోగులు కలలు సాకారం అవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారదిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.  

సింహారాశి:

సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు.  

 కన్యా రాశి: 

ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు భాదిస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. గృహప్రవేశం నిర్మాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థాన చలన సూచనలున్నవి. వారం మధ్యలో మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.   ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తులు నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న త్వరగా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయట పడతారు. రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.  

వృశ్చిక రాశి: 

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలు సమస్యలను రాజీ చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు.  

ధనస్సు రాశి:

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు.  

మకర రాశి:

 చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు నుండి బయటపడతారు. సోదరుల నుండి స్థిరాస్థి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  

కుంభ రాశి: 

గృహమును కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి. అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలు లో అవరోధాలు తొలగుతాయి.  

మీన రాశి:

ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చ గలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని రంగాలవారు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వారం ప్రారంభంలో ధన పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.  

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×