BigTV English
Advertisement

GudiGantalu Today episode: నగలను అమ్మేసిన మనోజ్.. సుశీల కోసం బంగారు చైన్.. అడ్డంగా ఇరుక్కున్న ప్రభావతి..

GudiGantalu Today episode: నగలను అమ్మేసిన మనోజ్.. సుశీల కోసం బంగారు చైన్.. అడ్డంగా ఇరుక్కున్న ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode November 2d: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా తెచ్చిన చేపల కవర్ ని ప్రభావతి తీసుకొని బయటికి వచ్చేసి మనోజ్ కు ఇస్తుంది. మనోజు తాకట్టు కోసమని బంగారు కొట్టుకు వెళ్తాడు. మరి ఏదో పచ్చి చేపల వాసన వస్తుంది అని అనగానే అంతా వెతుకుతారు కానీ మనోజ్ చేతిలో ఉన్న కవర్లో ఆ చేపలు ఉన్నాయని తెలుసుకోలేక పోతాడు. సేటు దగ్గరికి వెళ్లి నాకు ఒక నాలుగు లక్షలు కావాలి అని చేపలని అతని ముందు వేస్తాడు. ఇందాక నుంచి చేపల కంపు కొడుతుందని అందరూ అనుకుంటున్నారు..


నీ దగ్గర చేపలు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావా ముందు ఈ చేపలను తీసుకెళ్లి అక్కడ పడేయ్ అనేసి అంటారు. నేను బంగారమే తీసుకొచ్చాను సేటు.. కానీ అవి చాపలు ఎలా అయ్యాయో నాకు అర్థం కావట్లేదు అని మనోజ్ అంటాడు. నువ్వు బంగారు తీసుకొని వస్తే ఇవి చేపలు ఎందుకు అయ్యాయి గాల్లో ఏమైనా చేపలు వచ్చి బంగారాన్ని తినేశాయా ఏంటి అని సేటు మనోజ్ ని దారుణంగా తిట్టేస్తాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది సేటు నేను చూస్తే తీసుకొస్తాను అని మనోజ్ మళ్ళీ వెళ్ళిపోతాడు.. మీనా కూర చేసేందుకు చేపల కర్రీ లోపలికి తీసుకొని వెళ్తుంది.. ఆ కవర్ ని ప్రభావతి మాయం చేస్తుంది. మొత్తానికి మళ్లీ మనోజ్ రావడంతో ఆ కవర్ ని మనోజ్ ఇచ్చి ప్రభావతి తృటిలో తప్పించుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. చేపల కవర్ మారిపోయిందని ప్రభావతి చెప్పగానే అక్కడ అందరూ షాక్ అయిపోతారు. దాకా మీనా నన్ను గుద్దినప్పుడు ఆ కవర్లు మారిపోయాయి.. చేపలు ఉన్న కవర్లను మనోజ్ తీసుకెళ్లాడు. ఇవి నా బ్లౌజ్ పీసులకు సంబంధించినది అని ప్రభావతి అనగానే బాలుకి ఏదో అనుమానం కలుగుతుంది. ట్రైలర్ షాపు నాకు తెలుసు నేను వెళ్లి ఇచ్చేస్తానని బలవంతంగా ప్రభావతి దగ్గర ఉన్న కవర్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు.. ప్రభావతి మాత్రం నేను ఇవ్వను మనోజ్ వచ్చిన తర్వాతనే ఇస్తాను అని మొండిగా ఆ కవర్ని లాక్ ఉంటుంది.. ఇంతగా ఈ కవర్ ని ఇవ్వకుండా దాస్తున్నావు అంటే ఇందులో ఏదో ఉంది చూడాలి అని బాలు అంటాడు. ఏముంటాయి నీ మొహం ఉంటాయి ఇందులో నా బ్లౌజ్ పీసులు మాత్రమే ఉన్నాయని ప్రభావతి అంటుంది. ఇద్దరూ కలిసి కాసేపు వాదులాడుకుంటారు.


అప్పుడే మనోజ్ ఇంట్లోకి రావడంతో ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది. మనోజ్ వచ్చాడు కదా వాడే తీసుకెళ్తాడు.. సత్యం ఏ కవరో ఏంటో కూడా చూసుకోకుండా ఎలా తీసుకెళ్తావ్ రా నువ్వు ఎప్పుడు మారతావురా అని మనోజ్ ని తిడతాడు. వాడు ఎందుకు చూస్తాడు నాన్న అమ్మని గుడ్డిగా నమ్మేస్తాడు అమ్మ ఏది చెప్తే అదే చేస్తాడు. అమ్మ ఏది ఇచ్చిందో అదే నిజమైన కవర్ అనుకోని వెళ్లిపోయి ఉంటాడు అని బాలు అంటాడు. కవర్ని తీసుకోగానే నాలుగో వస్తాయా అని మనోజ్ ని అడుగుతాడు. వస్తాయి లేరా వెళ్ళు అని ప్రభావతి అంటుంది. నాలుగేంటి అనని బాలు అడుగుతాడు.

నాలుగు మీటర్ల అని అంటున్నాడు అని ప్రభావతి మొత్తానికి మనోస్ ని మేనేజ్ చేసి బయటికి పంపిస్తుంది.. సేటు షాప్ లోకి వెళ్లిన మనోజ్ ని సేటు దారుణంగా అవమానిస్తాడు. మరేం పర్లేదు మనకు కావలసింది డబ్బులే కదా అని మనోజ్ అతనికి బంగారు చూపిస్తాడు. దీనికి నీకు రెండు లక్షలు మాత్రమే వస్తాయి అని సేటు అనగానే మనోజ్ ఫ్యూజులు అవుట్ అవుతాయి.. నాకు ఇప్పుడు నాలుగు లక్షలు అర్జెంటుగా కావాలి అయితే వీటిని అమ్మేస్తున్నాను నాకు 4 లక్షలు ఇవ్వండి అని మనోజ్ స్టేట్ ని అడుగుతాడు.. అంతే కాదు ఆ నగలను ఫోటో తీసుకొని సేటు దగ్గర డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

ఇక మీనా అమ్మమ్మకు ఇప్పటివరకు మనం ఏమీ చేయించలేదు కదా నాకు చాలా బాధగా ఉందండి.. ముగ్గురు మనవల్లుండి కూడా ఆమెకు ఒక బంగారు నగ కూడా చేయించుకోవడం నిజంగా బాధాకరం అనేసి మీనా అంటుంది.. నానమ్మకి అలాంటి ఆశలు ఏమీ లేవు కానీ మనం చేయిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని బాలు అంటాడు. ఈ విషయాన్ని వెళ్లి సత్యంతో చెప్తారు. మీనా నగలు ఉన్నాయి కదా నాన్న అవి ఎట్లా ఇప్పుడు వేసుకోవట్లేదు కదా వాటిని తాకట్టు పెట్టి శీల డార్లింగ్ కి చేను కొందామని అంటాడు.

నువ్వు చెప్పినడియ బాగానే ఉంది రా మీ అమ్మ రాని వచ్చిన తర్వాత ఆ నగలను తీసుకొని వెళ్లి తాకట్టు పెట్టి చైన్ కొనుక్కొని వద్దామని సత్యం అంటాడు.. మనోజ్ కి ఎలాగోలాగా సందేశానని సంతోషపడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి రాగానే సత్యం ఆ బంగారం ఇవ్వు తాకట్టు పెట్టి మా అమ్మకి చేయని కొనాలి అని సత్యం అంటాడు. దేవుడా ఇలా ఇరుక్కున్న ఏంట్రా బాబు అని ప్రభావతి అనుకుంటుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని కామాక్షికి చెప్పి తన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో అడగాలని అక్కడికి వెళుతుంది. నా దగ్గర ఎక్కడున్నాయి వదిన చీటీకి పడిన డబ్బులు ఎప్పుడు అయిపోయాయి చీటీ వేసుకున్నారు అని అంటుంది.

మనోజ్ కి ఫోన్ చేసి ఆ డబ్బులను వాళ్ళకి ఇచ్చేసి వెంటనే నువ్వు నగలను తీసుకురావాలని చెప్తుంది. మనోజ్ కి ఆ మాట వినగానే ఫ్యుజులు అవుట్ అవుతాయి. ఎలాగైనా సరే ఆ సేటు దగ్గరికి వెళ్లి ఆ నగలను తీసుకురావాలి లేకపోతే అమ్మతోపాటు నేను కూడా అడ్డంగా దొరికిపోతాను అని అనుకుంటాడు.. సేటుకి ఫోన్ చేసి ఆ నగలు ఉన్నాయండి మాకు ఇవ్వండి నేను డబ్బులు ఇచ్చేస్తాను అని అంటాడు. ఒక్కసారి మా దగ్గరకు వచ్చిన బంగారం మేము కరిగించేస్తామని అంటాడు. ఆ విషయం వినగానే మనోజ్ షాక్ అవుతాడు.

Also Read : ప్రేమను పొగిడేసిన ధీరజ్.. భద్ర సేన మాస్టర్ ప్లాన్.. సాగర్ ను ఆడుకున్న నర్మదా..

ప్రభావతికి వెంటనే ఈ విషయాన్ని చెప్పాలని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కామాక్షి ఇంట్లో ప్రభావతి ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి అమ్మ ఆ నగలు లేవని అంటాడు.. నగలు లేకపోవడం ఏంట్రా నువ్వు తాకట్టే కదా పెట్టింది వెళ్లి ఆ డబ్బులు తీసుకొని ఇచ్చి నగలు తీసుకురా లేకపోతే ఇంట్లో నన్ను ఉండనివ్వరు చంపేస్తాడు మీ నాన్న అని అంటుంది. ఆ నగల నేను తాకట్టు పెట్టలేదు అమ్మ డబ్బులు తక్కువ వస్తున్నాయని అమ్మేశాను.. వాడు వాటిని కరిగించేసాడంట ఇప్పుడేం చేయాలి.. ఎంత పని చేసావ్ రా నీ వల్ల నేను ఇరుక్కున్నాను కచ్చితంగా ఇది విషయం ఇంట్లో తెలిస్తే చంపేస్తారు అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today November 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఎస్కేప్ కు ప్లాన్ చేసిన మనోహరి 

Intinti Ramayanam Today Episode: మీనాక్షి కోసం చక్రధర్ వేట.. పల్లవికి కరెంట్ షాక్.. మీనాక్షిని చంపేయ్యాలని ప్లాన్..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమను పొగిడేసిన ధీరజ్.. భద్ర సేన మాస్టర్ ప్లాన్.. సాగర్ ను ఆడుకున్న నర్మదా..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సూపర్ చిత్రాలు.. ఏ ఒక్కటి మిస్ అవ్వొద్దు.  

Yukta Malnad : ఎయిర్ హోస్టెస్ జాబ్.. అమ్మకు ఇష్టం లేకుండానే ఆ పని చేశాను.. పెళ్లి అప్పుడే..?

Big tv Kissik Talks: పృథ్వీతో లవ్ ఓపెన్ అయిన విష్ణు..నేను ఆ టైప్ కాదంటూ!

Big tv Kissik Talks: సుధీర్ లేకపోతే జీవితమే లేదు… విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Big Stories

×