E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 30 – డిసెంబర్‌ 06) ఈ వారం ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి కొత్త వాహన యోగం

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 30 – డిసెంబర్‌ 06) ఈ వారం ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి కొత్త వాహన యోగం
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (నవంబర్‌ 30 – డిసెంబర్‌ 06) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు.  వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. 

 మిథున రాశి: 

ఈ వారం  దీర్ఘకాలిక రుణాలు కొంత తీరతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతా. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

 సింహారాశి:

ఈ వారం  ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఋణ వత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

 కన్యా రాశి: 

 ఈ వారం  సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం  చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల స్థానచలన సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి: 

ఈ వారం స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరిలో పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

 ఈ వారం దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

 ఈ వారం భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు ఉంటాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి: 

 ఈ వారం ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. భూవివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహాల సూచనలు ఉన్నవి. మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి:

 ఈ వారం ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. బంధు మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×