Bigg Boss 9 Telugu: నేడు వీకెండ్ ఎపిసోడ్ లో అందరికీ పడాల్సిన వాళ్లకి కౌంటర్లు పడిపోయాయి. వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు చాలామంది వీక్షకులు. కళ్యాణ్ మెడను పవన్ పట్టుకోవడం, తీవ్రమైన చర్చకు దారితీస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ దాన్ని సింపుల్ గా క్లోజ్ చేశారు బిగ్ బాస్. మరోవైపు సంజన ఇష్యూ హైలెట్ చేస్తూ మాట్లాడారు. ఒక తరుణంలో గేట్స్ ఓపెన్ ఉన్నాయి సంజన వెళ్లిపోవచ్చు అని అన్నారు.
అయితే సంజన వెళ్లిపోవడానికి రెడీ అవుతున్న తరుణంలో అలా వెళ్ళిపోవటం నీ చేతుల్లో లేదు అంటూ మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా జస్ట్ సేవ్ అవ్వడానికి సంజనా తప్పు అని హౌస్ మేట్స్ కూడా చెప్పేశారు. వాస్తవానికి సంజన మాట్లాడిన దాంట్లో పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు. తను చూసింది చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా చాలామంది సంజనాకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఏదో మేనేజ్ చేసి సారీ చెప్పించడంతో ఆ వివాదం కూల్ అయిపోయింది.
నాగార్జున రీతును నిల్చబెట్టి పవన్ తో నీకేంటి సంబంధం అని అడిగారు. ఇమ్మానుయేల్ నామినేషన్ లో నీకేంటి సంబంధం కెప్టెన్ గా ప్రతి దానికి నువ్వు ఇన్వాల్వ్ అయిపోవచ్చా అని అడిగారు. పవన్ కి నోరు లేదా తనని తాను డిపెండ్ చేసుకోలేడా అంటూ నాగార్జున అడిగారు. దానికి ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిందో రీతు.
ఈ విషయాలన్నీ పవన్ మాట్లాడడా నువ్వు ఏమైనా లాయర్ వా? కెప్టెన్ గా నామినేషన్స్ డిస్టబెన్స్ లేకుండా పాయింట్ టూ పాయింట్ జరగాల్సిన రెస్పాన్స్బిలిటీ నీ మీద ఉంది. కానీ కెప్టనే దాన్ని బ్రేక్ చేసేస్తే ఎలా అని నాకు అడిగారు. బ్లూ టీం దగ్గర ఒక డిస్కషన్ జరిగింది అప్పుడు పవన్ ఉన్నాడా లేడా అనే దాని పైన కూడా ప్రశ్నించారు బిగ్ బాస్. దానికి కూడా ఏదో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది రీతు.
మొత్తానికి రీతు పవన్ రిలేషన్ గురించి పలు రకాల వార్తలు రావడమే కాకుండా నాగర్జున మీద నెగిటివ్ కామెంట్స్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. దీనికి కారణం ఇమ్మానుయేల్ కు సంజన నూనె రాయడం, పవన్ రీతుతో కలిసి ఉండడాన్ని నాగార్జున కంపేర్ చేశారు.
దానికి దీనికి ఎవరైనా కంపేర్ చేస్తారా అంటూ హోస్ట్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది. మరోవైపు సంజన పవన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశారు. ఇక సంజనాను బిగ్ బాస్ ప్రశ్నిస్తున్న టైం లో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే చాలా సజావుగానే హోస్ట్ తెలివిగా ఈ ఎపిసోడ్ ఫినిష్ చేశారు.
Also Read: Rajendraprasad : మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్, ముసలతనం వలన వచ్చిన చాదస్తమా?