E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Weekly Horoscope May 03 To May 09: ఈ వారం ఆ రాశి వ్యాపారులకు కష్టకాలం – వారికి ఆర్థిక సమస్యలు

Weekly Horoscope May 03 To May 09: ఈ వారం ఆ రాశి వ్యాపారులకు కష్టకాలం – వారికి ఆర్థిక సమస్యలు

Weekly Horoscope: 

Advertisement

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (మే 03 – మే 09) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం మీకు ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుండి క్రమక్రమంగా బయట పడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నూతనగృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం మీకు ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలలో ఓర్పుతో వ్యవహరించటం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు.

 మిథున రాశి: 

ఈ వారం మీకు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో కొన్ని సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం మీరు వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇంటా బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

సింహారాశి:

ఈ వారం మీరు చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చుట్టుపక్కల వారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

 కన్యా రాశి: 

 ఈ వారం మీకు పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం మీకు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటాబయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంతవరకు పనిఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చిక రాశి: 

ఈ వారం మీ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి:

ఈ వారం మీకు కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి.

మకర రాశి:

ఈ వారం మీరు అనుకున్న పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయట పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశములు లభించవు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.

కుంభ రాశి: 

ఈ వారం మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి.

మీన రాశి:

ఈ వారం మీకు సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున ఒక విషయంలో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Big Stories

×