Baby Born Flight: ఫ్లైట్ జర్నీ అంటే ఎలా ఉంటుంది…ఒక దగ్గర ఎక్కామా ..మరో దగ్గర దిగామా అన్నట్టుగా సాదా సీదాగా ఉంటుంది. కానీ, డెల్టా ఫ్లైట్ 478 ప్యాసింజర్స్ కి మాత్రం అది ఒక మంచి మెమరబుల్ జర్నీలా మిగిలిపోయింది. ఎందుకో తెలుసా ..విమానం మేఘాలలో ఉన్నప్పుడే ఒక పండంటి బాబు భూమి మీదకి వచ్చేసింది మరి. అవును …గాల్లో ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడే ఉండగానే ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది మరి .
అసలేం జరిగింది?
విషయం లోకి ఎంట్రీ ఇస్తే ..అది అట్లాంటా నుంచి పోర్ట్ ల్యాండ్‌కు బయలుదేరిన డెల్టా ఫ్లైట్ 478. అందులో దాదాపు 153 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐదు గంటల ప్రయాణం అది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటికే శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఒక మహిళకు సడెన్ గా పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయ్. సుమారు 35 నిమిషాల పాటు ఆమె నొప్పులతో విలవిలలాడిపోయింది. విమానం ల్యాండ్ అవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఒకవైపు టెన్షన్, మరోవైపు ఎమర్జెన్సీ. ఏం చేయాలో తెలీని స్థితిలో వెంటనే అలర్ట్ అయ్యారు విమానం లో ఉండే ఎయిర్ హోస్టెస్.
దేవుళ్లలా వచ్చిన డాక్టర్, నర్సులు
మామూలుగా విమానంలో డెలివరీ అవడం చాల రేర్ మరియు ప్రెగ్నెంట్ లేడీకి రిస్క్ కూడా.కానీ, ఆ మహిళ అదృష్టం బాగుంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో ఒక డాక్టర్ మరియు ఇద్దరు నర్సులు ఉన్నారు. ఎయిర్ హోస్టెస్‌లు విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని అనడంతో, వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఫ్లైట్ అటెండెంట్లతో కలిసి, అక్కడ ఉన్న చిన్నపాటి మెడికల్ కిట్ తోనే ఆ డాక్టర్ టీం డెలివర్ చేయడానికి రెడీ అయిపొయింది. ఇక అప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఎమర్జెన్సి ని అనౌన్స్ చేసింది. విమానం ల్యాండ్ కావడానికి ముందే, గాలిలోనే ఆ మహిళ సేఫ్ గా డెలివరీ అయ్యింది.
also read :బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’కి థియేటర్ల షాక్? ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. టాలీవుడ్ కి పెద్ద గండమే!
సీటు బెల్టులు కూడా పెట్టుకోకుండానే..
ఈ ఇన్సిడెంట్ లో ఇంటరెస్టింగ్ ఏంటో తెలుసా…విమానం ల్యాండింగ్ కావడానికి కేవలం 30 నిమిషాల ముందు ఈ డెలివరీ ప్రాసెస్ కంప్లీట్ అయింది.పాప పుట్టాక బొడ్డు తాడును కట్ చేసి, బిడ్డను జాగ్రత్తగా బట్టలో చుట్టేసరికి విమానం రన్‌వేకు చేరుకుంది.మాములుగా ల్యాండింగ్ సమయంలో ప్యాసింజర్స్ సీటు బెల్టులు ధరించాలి.కాని, ఆ సమయంలో డాక్టర్ మరియు అక్కడున్న వాళ్ళు అంతా బిడ్డను కాపాడే పనిలో పడి సీటు బెల్టులు పెట్టుకోకుండానే, సీట్లను గట్టిగా పట్టుకుని ల్యాండ్ అయ్యారు. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ పండంటి పాపను తల్లికి చేతికి అప్పగించారు.
ప్రయాణికుల కేరింతలు
ఇక తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలియగానే విమానంలోని 153 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆ తల్లిని, డాక్టర్స్ ని అభినందించారు. డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా ఈ ఇన్సిడెంట్ ని కన్ఫాం చేస్తూ తమ విమానంలో ఒక పాపాయి పుట్టడం తమకెంతో సంతోషంగా ఉందని ప్రకటించింది.
ఎంత టెక్నాలజీ పెరిగినా, ట్రెండ్ ఎలా మారినా…సాటి మనుషులకి సాయం చేసిన గుణం ఉన్నప్పుడే ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయని మరోసారి ప్రూవ్ అయ్యింది.
also read :గాయపడ్డ సింహం గర్జించలేదు.. జెట్లీ స్పీడ్ అందుకోలేదు.. మే తొలివారం డిజాస్టర్?