E-Paper
Advertisement

Shukra Maha Dasha: 6వ తేదీన పుట్టారా..? మీకు శుక్ర మహా దశ ఎప్పుడు పడుతుందో తెలుసా..?

Shukra Maha Dasha: 6వ తేదీన పుట్టారా..? మీకు శుక్ర మహా దశ ఎప్పుడు పడుతుందో తెలుసా..?
Advertisement

Shukra Maha Dasha: మీరు ఏ నెలలో అయినా 6వ తేదీన పుట్టారా..? అయితే మీకు జీవితంలో ఎప్పుడు స్థిరత్వం వస్తుదో తెలుసా..? మీకు ఎప్పుడు శుక్రమహాదశ పడుతుందో తెలుసా..? అసలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం నూటికి వెయ్యిరెట్టు ఎప్పుడు వస్తుందో తెలుసా..? తెలియకపోతే మీకోసమే ఈ కథనం.

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం 6వ తేదీన (ఏ నెలలోనైనా) జన్మించిన వారు అత్యంత అదృష్టవంతులుగా పరిగణించబడతారు. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు (Venus). శుక్రుడు ప్రేమ, విలాసం, కళలు మరియు సౌకర్యాలకు కారకుడు. కాబట్టి వీరి జీవితం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు.

Advertisement

వ్యక్తిత్వం, స్వభావం: 6వ తేదీన పుట్టిన వారిలో ఒక విధమైన అయస్కాంత శక్తి ఉంటుందట. మాటతీరు, నడవడికతో ఎదుటివారిని సులభంగా ఆకర్షిస్తారట. వీరు కుటుంబానికి, స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారట. వీరు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండటానికి ఇష్టపడతారట. మంచి బట్టలు, ఆభరణాలు ధరించాలని కోరుకుంటారట. అలాగే విలాసవంతమైన వస్తువుల పట్ల వీరికి ఇష్టం ఎక్కువగానే ఉంటుందట. ఇక శుక్రవారం పుట్టిన వారికి గొడవలు అంటే అసలు నచ్చదట. అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారట.

భవిష్యత్తు మరియు కెరీర్: శుక్రవారం పుట్టిన వారి మీద శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. వీరికి జీవితంలో సృజనాత్మక రంగాలు  అద్భుతంగా కలిసి వస్తాయట. అలాగే సినిమా, సంగీతం, ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ లేదా ఇంటీరియర్ డెకరేషన్ లాంటి వృత్తులు కూడా వీరికి కలిసొచ్చేవేనని పండితులు సూచిస్తున్నారు. హోటల్ రంగం, రెస్టారెంట్లు, జ్యువెలరీ షాపులు లేదా బ్యూటీ పార్లర్లకు సంబంధించిన వ్యాపారాలు చేసినా వీరికి బాగానే కలిసి వస్తుందట.

Advertisement

అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది?: 6వ తేదీన పుట్టిన వారికి సాధారణంగా జీవితంలో 24 ఏళ్ల తర్వాత మంచి మార్పులు వస్తాయట. 24, 33, 42, 51, 60 సంవత్సరాలలో వీరికి శుక్రమహాదశ పట్టే అవకాశం ఉంటుందట. దీంతో వీరు ఆయా వయసులలో జీవితంలో పెద్ద మలుపులు లేదా గొప్ప విజయాలు చూస్తారట. వీరికి శుక్రవారమే అత్యంత శుభప్రదమైన రోజట. ఏవైనా ముఖ్యమైన పనులు ఆ రోజున మొదలుపెట్టడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

సలహాలు, సూచనలు: శుక్రవారం పుట్టిన వారికి లేత నీలం (Light Blue), తెలుపు (White), గులాబీ (Pink) రంగులు అదృష్ట రంగులట. అయితే శుక్రవారం పుట్టిన వారు వీలైతే నలుపు రంగును అవైడ్‌ చేయడమే బెటర్‌ అని పండితులు హెచ్చరిస్తున్నారు. వీరికి అదృష్ట సంఖ్యలు 6, 15, 24. వీరు ఏ పని చేసినా ఈ తేదీల్లో చేస్తే.. విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయట.  శుక్రవారం పుట్టిన వారు విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుందట. కాబట్టి పొదుపు చేయడం కూడా అలవాటు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులను అతిగా నమ్మడం వల్ల కొన్నిసార్లు మోసపోయే ప్రమాదం కూడా ఉందట. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: సొంత కొడుకుతోనే యుద్ధం చేసిన హనుమంతుడు – ఇంకా వాల్మీకి రామాయణంలో ఏముందో తెలుసా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×