E-Paper
Advertisement

Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ఆయన లోటు తీర్చరానిది!

Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ఆయన లోటు తీర్చరానిది!
Advertisement

Film industry: చిత్ర పరిశ్రమలో గత పది రోజులుగా స్టార్ సెలబ్రిటీలుగా పేరు సొంతం చేసుకున్న కొంతమంది ప్రముఖులు ఒక్కొక్కరిగా తుది శ్వాస విడుస్తూ అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న భానుప్రియ తల్లి తుది శ్వాస విడవగా.. మరొకవైపు యంగ్ మోడల్ కం నటి హర్షాలీ యాక్సిడెంట్లో మరణించింది. బంగారు భవిష్యత్తు ఉన్న ఈమె 30 ఏళ్లకే యాక్సిడెంట్ కారణంగా తన ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఆ మరణ వార్తలు మరువకముందే ఇప్పుడు మరో నటుడు కన్నుమూశారు. ఆయన లోటు తీర్చరానిది అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరి ఆయన ఎవరు? ఏ కారణాల చేత మరణించారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ నటుడు కన్నుమూత..

ఆయన ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ టోల్కన్ (James tolkan).. 94 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. న్యూయార్క్ లోని తన నివాసంలో వృద్ధాప్య కారణాల వల్ల తుది శ్వాస విడిచినట్లు మేనేజ్మెంట్ ధ్రువీకరించింది. ముఖ్యంగా తెరపై కఠినమైన ప్రిన్సిపాల్, కమాండర్ పాత్రలలో మెప్పించిన టోల్కన్ నిజజీవితంలో ఎంతో దయగల వ్యక్తిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మరణ వార్త తెలిసి అభిమానులు తీవ్ర దుఃఖింతులు అవుతున్నారు. ముఖ్యంగా బ్యాక్ టు ది ఫ్యూచర్ , టాప్ గన్ వంటి చిత్రాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హాలీవుడ్ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు జేమ్స్ టోల్కన్.

జేమ్స్ టోల్కన్ బాల్యం, విద్యాభ్యాసం..

Advertisement

జేమ్స్ టోల్కన్ మిచిగాన్ లోని కాలుమెట్ లో పశువుల వ్యాపారి అయినా రాల్ఫ్ ఎం టోల్కన్, డేల్ నికోల్స్ దంపతులకు 1931 జూన్ 20న జన్మించారు. కొరియన్ యుద్ధ సమయంలో యునైటెడ్ స్టేట్స్ నేవీలో చేరడానికి కంటే ముందే ఫుట్బాల్ జట్టులో ఆడిన ఈయన.. ఫుట్బాల్ స్కాలర్షిప్ పై ఈస్టర్ అరిజోనా కాలేజీలో చేరి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇకపోతే యూఎస్ఎస్ శాండోవల్ నౌకలో పనిచేసే సమయంలోనే గుండె సంబంధిత సమస్యలు రావడంతో ఒక సంవత్సరంలోపే నేవీ నుండి ఆయన బయటకు వచ్చేశారు. 1956లో అయేవా విశ్వవిద్యాలయం నుండి నాటక రంగంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా అనుకున్నారు.

ALSO READ:Bellamkonda Sai Srinivas: కావ్యతో పెళ్లికి సిద్ధమైన బెల్లంకొండ హీరో.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

సినిమా రంగంలోనే కాదు టీవీ రంగంలో కూడా గుర్తింపు..

Advertisement

ఇక తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈయన.. బ్యాక్ టు ది ఫ్యూచర్ పార్ట్ వన్, బ్యాక్ టు ది ఫ్యూచర్ పార్ట్ 2 లలో నటించి ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ సినిమాలతో పాటు టెలివిజన్ సిరీస్ లలో కూడా నటించి మరింత పేరు సంపాదించుకున్న జేమ్స్ .. వీడియో గేమ్స్ లో కూడా పేరు గడించారు. ఇక అలాంటి ఈయన మరణాన్ని ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నారు.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×