E-Paper
Advertisement

Valmiki Ramayana: సొంత కొడుకుతోనే యుద్ధం చేసిన హనుమంతుడు – ఇంకా వాల్మీకి రామాయణంలో ఏముందో తెలుసా

Valmiki Ramayana: సొంత కొడుకుతోనే యుద్ధం చేసిన హనుమంతుడు – ఇంకా వాల్మీకి రామాయణంలో ఏముందో తెలుసా
Advertisement

Valmiki Ramayana: హనుమంతుడు సొంత కొడుకుతోనే యుద్దం చేశాడన్న విషయం ఎంత మందికి తెలుసు..? హనుమంతుడి కొడుకు రామరావణ యుద్దంలో రావణాసురుడి వైపు యద్దం చేశాడన్న విషయం ఎంత మందికి తెలుసు..? అయితే కొడుకుతో చేసిన యుద్దంలో ఎవరు గెలిచారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రామరావణ యుద్దంలో హనుమంతుడు సొంత కొడుకుతో యుద్దం చేశాడు. యుద్దం చేసే వరకు ఆయన తన సొంత కొడుకన్న విషయం హనుమంతుడికి కానీ యుద్దం చేస్తున్న వ్యక్తి తన తండ్రి అన్న విషయం కానీ ఇద్దరికీ తెలియదట. అయితే యుద్దం మధ్యలో నిజం తెలియడంతో హనుమంతుడు కొడుకు హనుమంతుడిని క్షమాపణ అడిగి యుద్దం విరమించాడట. అయితే హనుమంతుడికి పుట్టిన కొడుకు మకరధ్వజుడు. రామాయణంలోని అత్యంత ఆసక్తికరమైన మరియు అరుదైన పాత్రలలో ఒకటి.

Advertisement

మకరధ్వజుడి జన్మ వృత్తాంతం:  శ్రీరాముడి కోసం సీతా అన్వేషణలో భాగంగా హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లాడు. ఆ ప్రయాణంలో, అపారమైన వేడి, శ్రమ వల్ల హనుమంతుడి శరీరం నుండి ఒక చెమట బిందువు (చెమట చుక్క) సముద్రంలో పడిందట.  సముద్రంలో పడిన ఆ చెమట చుక్కను ఒక పెద్ద మొసలి మింగిందట. ఆ చెమటలోని హనుమంతుడి తేజస్సు వల్ల ఆ మొసలికి మకరధ్వజుడు జన్మించాడట.

పాతాళ లోకానికి రక్షకుడు: రావణాసురుడి తమ్ముడైన అహిరావణుడు పాతాళలోకంలోని తన కోట ద్వారం వద్ద మకరధ్వజుడిని కాపలాదారుడిగా నియమించుకున్నాడట. ‌హనుమంతుడి అంశతో పుట్టిన మకరధ్వజుడు ఎంతో బలవంతుడట. తన బలంతో ఆ కోటలోకి చీమను కూడా వెళ్లనిచ్చేవాడు కాదట.

Advertisement

హనుమంతుడు – మకరధ్వజుల యుద్దం: రామాయణ యుద్ధంలో అహిరావణుడు శ్రీరాముడిని, లక్ష్మణుడిని బంధించి పాతాళ లోకానికి తీసుకువెళ్తాడట. వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళానికి వెళ్తాడట. అక్కడ కోట ద్వారం వద్ద కాపలాగా ఉన్న మకరధ్వజుడు, హనుమంతుడితో యుద్దం చేస్తాడట. ఈ యుద్దంలో హనుమంతుడితో ఘోర యుద్దం చేసిన మకరధ్వజుడు చివరకు ఓడిపోతాడట. ఓడిపోయిన మకరధ్వజుడిని బంధించిన హనుమంతుడు ఇంత బలపరాక్రమశాలివి నువ్వు ఎవరు అని అడుగుతాడు.

దీంతో మకరధ్వజుడు  నేను హనుమంతుడి కుమారుడను.. మకరధ్వజుడను అని చెప్పగానే.. హనుమంతుడు షాక్‌ అవుతాడట. నేనే హనుమంతుడిని నేను ఆజన్మ బ్రహ్మచారిని నాకు కొడుకును అంటున్నావేంటి అని ప్రశ్నించగానే.. మకరధ్వజుడు సంతోషంగా హనుమంతుడిని మొక్కి జరిగిన విషయం మొత్తం చెప్తాడట. అప్పుడు హనుమంతుడు మకరధ్వజుడిని విడిచిపెట్టి.. లోపలికి వెళ్లి అహిరావణుడితో యుద్దం చేసి అప్పుడే పంచముఖి హనుమాన్‌ అవతారం ఎత్తి అహిరావణుడిని చంపేసి రామలక్ష్మణులను కాపాడతాడట.

ఇలా సొంత కొడుకుతోనే యుద్దం చేసిన హనుమంతుడి తర్వాత మకరధ్వజుడిని తీసుకుని రామ రావణ యుద్దంలో రాముడి వైపు యద్దం చేసేలా చేశాడట. మకరధ్వజుడు కూడా నిజం తెలియక సొంత తండ్రి అయిన ఆంజనేయస్వామితోనే యద్దం చేశాడట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: హనుమాన్ జయంతి తర్వాత ఆ రాశి జాతకులకు మహర్ధశ పట్టనుందట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×