E-Paper
Advertisement

ట్రాఫిక్ జామ్‌లో టైమ్ పాస్.. ట్రక్ డ్రైవర్ ఖతర్నాక్ ఐడియా, ఏం చేశాడో చూడండి!

ట్రాఫిక్ జామ్‌లో టైమ్ పాస్.. ట్రక్ డ్రైవర్ ఖతర్నాక్ ఐడియా, ఏం చేశాడో చూడండి!
Advertisement

High-Tech Truck Life: ట్రక్ డ్రైవర్ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా నిరంతరం రోడ్ల మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అయితే, కొన్నిసార్లు భారీ ట్రాఫిక్ జామ్ ల కారణంగా గంటల తరబడి రోడ్డు మీదే వేచి ఉండాల్సిన పరిస్థితి తెలుత్తుంది. అలా కాకుండా రోజులో కాసేపు రెస్ట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో తన బోర్ ఫీలింగ్ ను తగ్గించుకునేందుకు ఓ ట్రక్ డ్రైవర్ క్రేజీ ఆలోచన చేశాడు. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

క్యాబిన్ లో హైఎండ్ సిమ్ రేసింగ్ సెటప్‌

ఒక ట్రక్ డ్రైవర్ తన రోజువారీ జీవితాన్ని మరింత క్రేజీగా మార్చుకునేందుకు అద్భుతమైన ఆలోచన చేశాడు. సాధారణంగా ట్రక్‌ లో ఖాళీగా ఉండే ప్యాసింజర్ సీటును తీసేసి, దాని స్థానంలో సుమారు 6000 డాలర్ల విలువైన హైఎండ్ సిమ్ రేసింగ్ సెటప్‌ ను ఇన్ స్టాల్ చేశాడు. ఈ సెటప్ తో ట్రాఫిక్‌ లో ఆగిపోయిన సమయంలో లేదంటే రెస్ట్ టైమ్ లో ఎంటర్ టైన్ అయ్యేందుకు ఈ సెటప్ ను ఉపయోగించుకుంటున్నాడు.

ప్రొఫెషనల్‌గా  సిమ్ రేసింగ్ సెటప్  

Advertisement

ఈ సిమ్ రేసింగ్ సెటప్ చాలా ప్రొఫెషనల్‌ గా ఉంటుంది. ఇందులో ఫోర్స్ ఫీడ్‌  బ్యాక్ స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ స్టీరింగ్, లోడ్ సెల్ పెడల్స్, ఇంకా ఫ్లైట్ కంట్రోల్స్ లాంటి అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి గేమింగ్ ఎక్స్ పీరియెన్స్ ను చాలా రియలిస్టిక్‌ గా మార్చుతాయి. అంతేకాదు, ఇందులో i9 ప్రాసెసర్, RTX గ్రాఫిక్స్ కార్డ్‌ తో కూడిన పవర్ ఫుల్ కంప్యూటర్ ఉంది. దీని వల్ల గేమ్స్ స్మూత్‌ గా, హై క్వాలిటీ గ్రాఫిక్స్‌ నడుస్తాయి.

ట్రక్ పూర్తిగా ఆగిపోయిన సమయంలో..

ఈ ట్రక్ డ్రైవర్ ఈ సెటప్‌ ను పదే పదే ఉపయోగించడు. ట్రక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు లేదంటే ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో మాత్రమే దీన్ని ఉపయోగిస్తాడు. అంటే, డ్రైవింగ్ సమయంలో ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తగా వాడుకుంటాడు. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా యూజ్ చేసుకుంటున్నాడు. ట్రక్కింగ్ ఉద్యోగం అనేది సాధారణం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం.  అలాగే గంటల తరబడి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఈ సిమ్ రేసింగ్ సెటప్ అతనికి మానసికంగా రిలాక్స్ అవడానికి, అలాగే పని ఒత్తి నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది.

Advertisement

డ్రైవింగ్ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం

అతడు ఈ గేమింగ్ ద్వారా తన డ్రైవింగ్ స్కిల్ ను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించాడు. రియలిస్టిక్ సిమ్యులేషన్ వల్ల రోడ్డు పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో అతడు తన పనిని మరింత కాన్ఫిడెన్స్ గా చేస్తున్నాడు. సాంకేతికతను సరైన విధంగా ఉపయోగిస్తే, ఎంత కష్టమైన ఉద్యోగాన్నైనా కొంత సరదాగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఈ ట్రక్ డ్రైవర్.

Read Also: విశాఖలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. పోలీసులు కనిపించరు, చలాన్లు మాత్రం పడతాయ్, ఇదిగో ఇలా!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×