E-Paper
Advertisement

Marriage Horoscope: పెళ్ళైయ్యాక పూర్తిగా మారిపోయే జాతకులు ఎవరో తెలుసా..?

Marriage Horoscope: పెళ్ళైయ్యాక పూర్తిగా మారిపోయే జాతకులు ఎవరో తెలుసా..?
Advertisement

Marriage Horoscope: పెళ్లైయ్యాక కొంత మంది పూర్తిగా మారిపోతుంటారు. పెళ్లికి ముందు ఒక జీవితం ఉంటే పెళ్లైయ్యాక ఒక జీవితం అన్నట్టుగా మారిపోతుంటారు. అయితే అదంతా వారి గ్రహస్థితే అని చెప్తున్నారు పండితులు. ద్వాదశ రాశుల్లో పుట్టిన వారు పెళ్లైయ్యాక ఎలా మారిపోతారో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనిషి జీవితంలో ముఖ్యంగా రెండు దశలు ఉంటాయట. ప్రతి మనిషికి పెళ్లికి ముందు బ్యాచిలర్‌ లైప్‌ ఉంటే పెళ్లైయ్యాక సంసారికి జీవితం ఉంటుందని అయితే పెళ్లికి ముందు ఒక లెక్క పెళ్లైయ్యాక ఒక లెక్క అన్నట్టు మనుషుల జీవితాలు మారిపోతుంటాయట. అయితే పన్నెండు రాశుల్లో పుట్టిన జాతకుల జీవితాలు పెళ్లైయ్యాక ఎలా మారిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు పెళ్లికి ముందు ఊపిరి పీల్చకుండా పనులు చేసే స్వభావం కలిగి ఉంటారట. కానీ పెళ్లైయ్యాక మాత్రం ఓపికతో, కుటుంబ అభివృద్ది కోసం పని చేస్తుంటారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారట.

వృషభ రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు పెళ్లికి ముందు తాము అనుకున్నదే జరగాలనే మనస్తత్వం కలిగి ఉంటారట. కానీ పెళ్లి అయ్యాక మాత్రం సంయమనం పాటించడం భాద్యతగా ప్రవర్తించటం ఓపికగా మారిపోతారట.

Advertisement

మిథున రాశి: ఈ రాశి జాతకులు పెళ్లికి ముందు ఎక్కువ మాటలు మాట్లాడుతూ సరదా ఉంటారట. పెళ్లి అయ్యాక మాత్రం తక్కువగా మాట్లాడుతూ లోతైన ఆలోచనలు చేసే తత్వం కలిగి ఉంటారట.

కర్కాటక రాశి:  ఈ రాశలో పుట్టిన వ్యక్తులు పెళ్లికి ముందు చిన్న విషయాలకే బాధపడే మనస్తత్వం కలిగి ఉంటారట. పెళ్లైన తర్వాత కుటుంబాన్ని తలదన్నే ఆదరణ చూపడం నేర్చుకుంటారట.

సింహ రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు పెళ్లికి ముందు ధైర్యంగా ఉంటూ.. తానే పెద్దవాడినంటూ ప్రవర్తన కలిగి ఉంటారట. పెళ్లైన తర్వాత మనసులో మృదుత్వం, అనురాగంతో మారటం వీరిలో కనిపిస్తుందట.

కన్యా రాశి: ఈ రాశి జాతకులు పెళ్లికి ముందు ప్రతి విషయాన్ని స్పష్టంగా, క్షుణ్ణంగా పరిశీలించే థృక్పధం కలిగి ఉంటారట. పెళ్లైన తర్వాత ప్రాక్టికల్ దృక్పథంతో జీవితాన్ని చూసే తీరు మారిపోతుందట.

తులా రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు పెళ్లికి ముందు అందరికీ నచ్చేలా ఉండే ప్రయత్నం చేస్తారట. కానీ పెళ్లైన తర్వాత నిజమైన భాగస్వామిగా ప్రవర్తించడం అలవర్చుకుంటారట.

వృశ్చిక రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు పెళ్లికి ముందు అంతర్గత భావాలు బయటకు చెప్పకపోవడం.. సిగ్గు పడుతూ ఉండటం లాంటి లక్షణాలు కలిగి ఉంటారట. పెళ్లైన తర్వాత జీవిత భాగస్వామిని పూర్తిగా కాపాడే తత్వం కలిగి ఉంటారట.

ధనుస్సు రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు పెళ్లికి ముందు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారట. అదే పెళ్లైన తర్వాత బాధ్యతను సరదాగా మోసే శైలి అలవర్చుకుంటారట.

మకర రాశి: ఈ రాశి జాతకులు పెళ్లికి ముందు పని మీద దృష్టి పెట్టకపోవడం..  భావోద్వేగాలకు త్వరగా చలించడం లాంట లక్షణాలు కలిగి ఉంటారట. అదే పెళ్లైన తర్వాత ప్రేమతో, కుటుంబాన్ని నడిపించే శక్తిగా మారతారట.

కుంభ రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు పెళ్లికి ముందు నియమాలను ధిక్కరించే స్వభావం కలిగి ఉంటారట. కానీ పెళ్లైన తర్వాత సన్నిహితులకు అండగా నిలిచే గుణం అలవర్చుకుంటారట.

మీన రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు పెళ్లికి ముందు కలల ప్రపంచంలో విహరిస్తుంటారట. పెళ్లైన తర్వాత నిజాయితీగా ప్రేమనిచ్చే వ్యక్తిగా మారిపోతారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల అకామడేషన్ గురించి ఈ విషయాలు తెలుసా..? ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×