E-Paper
Advertisement

Tirumala Accommodation: తిరుమల అకామడేషన్ గురించి ఈ విషయాలు తెలుసా..? ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ

Tirumala Accommodation: తిరుమల అకామడేషన్ గురించి ఈ విషయాలు తెలుసా..? ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ

Tirumala Accommodation: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అకామడేషన్‌ గురించి భయపడుతున్నారా..? రూం దొరుకుతుందో లేదోనన్న టెన్షన్‌ పట్టుకుందా…? అయితే మీకు అలాంటి టెన్షన్‌ అవసరమే లేదు.. ఇప్పుడు తిరుమలలో ఈజీగా రూమ్స్‌ దొరుకుతున్నాయి. కాకాపోతే ఆలయ బోర్డు సూచించిన పద్దతుల్లో మీరు ప్రయత్నిస్తే మీకు రూమ్‌ దొరికేస్తుంది.

తిరుమలలో ఇప్పుడు రూం దొరకలేదన్న  ప్రశ్నే లేదు.. కాస్త లేటుగా అయినా సరే కానీ రూమ్స్‌ మాత్రం గ్యారంటీగా దొరికేస్తున్నాయి. కాకపోతే మీరు సింపుల్‌ ట్రిక్స్‌ పాటింస్తే సరిపోతుంది. ప్రస్తుతం తిరుమలలో శ్రీ ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం, ఎంబిసి, టిబి కౌంట‌ర్‌ (కౌస్తుభం), సిఆర్వో కార్యాల‌యంలోని సిఆర్వో జ‌న‌ర‌ల్‌, ఎఆర్‌పి కౌంట‌ర్ల ద్వారా గ‌దుల కేటాయిస్తున్నారు. సిఆర్వో జ‌న‌ర‌ల్ వ‌ద్ద ముందు వ‌చ్చిన వారికి ముందు ప్రాతిప‌దిక‌న సామాన్య యాత్రికుల‌కు గ‌దులు కేటాయిస్తారు.

ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి:

గ‌ది కేటాయింపు స‌మాచారాన్ని సంబంధిత యాత్రికుల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. ఆ ఎస్ఎంఎస్‌ను చూపి యాత్రికులు గ‌దులు పొందొచ్చు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి, కాటేజి దాత‌ల‌కు ఎఆర్‌పి కౌంట‌ర్‌లో గ‌దులు కేటాయిస్తారు. సిఆర్వో వెనుక వైపు గ‌ల కౌస్తుభం కౌంట‌ర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖ‌ల‌పై గ‌దులిస్తారు. శ్రీ ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం, ఎంబిసిలో ప్రముఖుల‌కు గ‌దులు కేటాయిస్తారు. ఇక ఆన్‌లైన్‌లో 3 నెల‌ల ముందు నుండి గ‌దులు బుక్ చేసుకోవ‌చ్చు. వీటిలో రూ.100/-, రూ.500/-, రూ.600/-, రూ.1000/-, రూ.1500/- అద్దె గ‌దులు ఉంటాయి.

పీఏసిల్లో స‌క‌ల సౌక‌ర్యాలు:

తిరుమ‌ల‌లోని ఆర్‌టిసి బ‌స్టాండులో ఇటీవ‌ల అందుబాటులోకి వ‌చ్చిన వెంకటాద్రి నిల‌యంతో క‌లిపి మొత్తం 5 యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాలున్నాయి. ఇక్కడ ఉచితంగా లాక‌ర్లు కేటాయిస్తారు. యాత్రికులు త‌మ వ‌స్తు సామ‌గ్రిని ఇందులో భద్రప‌రుచుకుని శ్రీ‌వారి ద‌ర్శనానికి వెళ్లి రావొచ్చు.  ఇక్కడ జల ప్రసాదం, మినీ క‌ల్యాణ‌క‌ట్ట‌, మ‌రుగుదొడ్లు, స్నాన‌పుగ‌దులు, అన్నప్రసాదం త‌దిత‌ర అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయి. అద్దె గ‌దులు దొర‌క‌నివారు పిఏసిల్లో బ‌స చేయ‌వ‌చ్చు.

వ‌స‌తి గ‌దులు, పిఏసిల్లో అందుబాటులో కిట్‌లు: 

తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి గ‌దులు, పిఏసిల్లో భ‌క్తుల‌కు కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాప‌లు, దిండ్లు, దుప్ప‌ట్లు, ఉన్ని కంబ‌ళి ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో బ‌స చేసిన యాత్రికులు అద‌నంగా వీటిని పొందొచ్చు. వీటికి ఒక రోజుకు 2 చాప‌లకు పది రూపాయలు, క‌వ‌ర్ల‌తో క‌లిపి  2 దిండ్ల‌కు పది రూపాయలు, ఒక దుప్ప‌టికి పది రూపాయలు, ఒక ఉన్ని కంబ‌ళికి ఇరవై రూపాయలు, సేవారుసుం వ‌సూలు చేస్తారు.

సామాన్య భ‌క్తుల కోసం 10 క‌ల్యాణ మండ‌పాలు:

సామాన్య భ‌క్తులు వివాహాలు చేసుకునేందుకు వీలుగా వ‌స‌తి క‌ల్ప‌న విభాగం ప‌రిధిలో ఎస్ఎంసి వ‌ద్ద 6, ఎటిసి వ‌ద్ద 1, టిబిసి వ‌ద్ద 3 క‌లిపి మొత్తం 10 క‌ల్యాణ మండ‌పాలున్నాయి. 90 రోజుల ముందు నుండి వీటిని క‌రంట్ బుకింగ్‌లో పొందొచ్చు. ఎస్ఎంసి వ‌ద్ద రూ.200/-, ఎటిసి వ‌ద్ద రూ.500/-, టిబిసి వ‌ద్ద రూ.200/- అద్దె ఉంది. ఇందుకోసం యువ‌తీ యువ‌కుల త‌ల్లిదండ్రులు సిఆర్వోలోని ఆర్వో-1 ఏఈవో గారిని సంప్ర‌దించాల్సి ఉంటుంది. యువ‌తీ యువ‌కుల వ‌య‌సు ధ్రువీక‌ర‌ణప‌త్రం జిరాక్స్ కాపీని స‌మ‌ర్పించాలి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో  పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..? వెంటనే ఆ దర్శనం కూడా చేసుకోవచ్చు

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×