E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 కన్యా రాశి ఫలితాలు

Yearly Horoscope: 2026 కన్యా రాశి ఫలితాలు
Advertisement

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026  కన్యా రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి. కానీ కష్టపడి పని చేస్తే ఉన్నత అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారం చేసే వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభాలు నిలకడగా వస్తాయి. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి విశ్రాంతి వలన కొంత ఉపయోగం ఉంటుంది. సంవత్సరం చివరికి మీరు పెట్టిన కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మనసుకు సంతృప్తి పెరుగుతుంది. మొత్తంగా ఓర్పుతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందవచ్చు.  ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3

జనవరి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి  ఖర్చులపై కొంత నియంత్రణ అవసరం. కుటుంబంలో చిన్న చిన్న మాట భేదాలు వచ్చిన త్వరగా సర్దుకుంటాయి. గతంలో ఆగిపోయిన విషయాలు మళ్లీ కదలికలోకి వస్తాయి. ఆర్థికంగా అవసరానికి తగ్గ ఆదాయం ఉంటుంది. 

ఫిబ్రవరి :

ఈ నెలలో ఈ రాశి వారికి రావలసిన బాకీల విషయాల్లో ఆలస్యం ఉండొచ్చు. వృత్తి, వ్యాపారాలలో బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం అవసరం.  ఆరోగ్యపరంగా ఉదర సంబంధ సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. 

మార్చి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధనప్రవాహం క్రమంగా మెరుగుపడుతుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. కొత్త పనులు మొదలు పెట్టేందుకు అనుకూల సమయం. అనవసర ఆలోచనల వల్ల కొంత మానసిక అలజడి ఉండవచ్చు.

ఏప్రిల్:

ఈ నెలలో ఈ రాశి వారు ఆస్తి, వాహన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో మార్పులు లేదా స్థాన మార్పు సూచనలు ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అవసరం. పెద్దల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేసే అవకాశం ఉన్నది.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ఆలోచనలు రావచ్చు. అదృష్టం కొంత తోడుగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఆరోగ్యం ఆశించిన విధంగా ఉంటుంది.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి  ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ముందస్తు ప్రణాళిక అవసరం. పని ఒత్తిడి పెరిగినా ఫలితం చివరికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి.

జూలై:

ఈ నెలలో ఈ రాశి వారికి  ఆదాయం క్రమంగా వచ్చినా పొదుపు చేయడం కష్టంగా ఉంటుంది. స్థిరత్వం అవసరం. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీయవచ్చు.  ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారికి  ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దేవాలయ దర్శనాలు మనశ్శాంతినిస్తాయి.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి  ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు. పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉంచాలి.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరిగినా సంతోషంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులకు తగిన ఫలితం లభించే అవకాశం ఉన్నది. ఆర్థికంగా లాభ సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూల కాలం.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి పనిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. అదనపు ఆదాయం లేదా నిలిచిపోయిన డబ్బు రావచ్చు.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా సమతుల్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి విశేషమైన సహాయ సహకారాలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. చేసిన శ్రమకు గౌరవం లభిస్తుంది.  విద్యార్థులకు అనుకూలం.

ALSO READ: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×