ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 కర్కాటక రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆరంభంలో పనుల్లో ఆలస్యాలు, ఆర్థిక ఒత్తిడులు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఉద్యోగం లేదా వృత్తిలో స్థిరత్వం కోసం ఎక్కువ శ్రమ అవసరం ఉంటుంది. సంవత్సరం మధ్య భాగం నుంచి పరిస్థితుల్లో క్రమంగా మార్పు కనిపిస్తుంది. ఆదాయం నెమ్మదిగా పెరిగే సూచనలు ఉన్నాయి. సంవత్సరం చివరికి మీ కృషికి తగిన ఫలితం లభించి, జీవితంలో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ సంత్సరం ఆదాయం రెండు, వ్యయం పదకొండు. రాజపూజ్యం నాలుగు, అవమానం ఏడుగా ఉంది.
ఈనెలలో ఈ రాశి వారికి అనవసరపు వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ప్రయాణాల విషయాలలో జాగ్రత్త అవసరం. రుణపరమైన ఒత్తిడి కొంత బాధించవచ్చు. మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు.
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు స్థిరంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది. బందు మిత్రుల సహాయం సహకారాలు పెరుగుతాయి. క్రయావిక్రయం సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలుంటాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంటిలో శుభ కార్యాలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. సంతానానికి అనుకూల కాలం. ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.
ఈ నెలలో ఈ రాశి వారి పితృదేవతల అనుగ్రహం మూలంగా ఇబ్బందులు తొలగవచ్చు. ఖర్చులు ఎక్కువ. బంధు మిత్రులతో గొడవలు ఏర్పడతాయి. దూర ప్రయాణం చేయాలి. శస్త్రచికిత్స ఋణ బాధలు మానసిక అశాంతి ఆస్తి నష్టం ఉంటాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి గాయాలు తగలవచ్చు. ఆరోగ్య విషయంలో దృష్టి సారించాలి. విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
ఈ నెలలో ఈ రాశి వారు దూర ప్రయాణం చేస్తారు. ఉన్నత పదవులు లభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. మాసం చివరన అనవసరమైన గొడవలలో ఇరుక్కుంటారు.
ఈ నెలలో ఈ రాశి వారికి అనవసరంగా గొడవలు ఉంటాయి. అనారోగ్యం, ఊహించని రీతి కష్ట నష్టాలు, దూర సంచారం, శుభ కార్యములకై ఖర్చు ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది.
ఈ నెలలో ఈ రాశి వారికి అధికారులతో గొడవలు మనశ్శాంతి కొరవడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. విలువైన వస్తువులను పోగొట్టుకోవడం, కళత్రంతో గొడవలు ఉండవచ్చు. వేళకు సరియైన తిండి దొరకదు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి ధనాదాయం బాగా ఉన్నా ధన నష్టం కూడా ఉంటుంది. విద్యార్థులకు పోటీలలో విజయం లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. భూ, భవనముల వలన లాభం, సోదరులకు మంచిది. శారీరక రుగ్మతలతో పాటు ఇతరుల వలన బాధలు ఉంటాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి మానసిక అశాంతి ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన కలవరపెడుతుంది. దేశ సంచారం శారీరక, మానసిక నలత ఏర్పడుతుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. స్థిర చిత్తత ఉండదు. సంతానానికి, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. స్థాన చలన సూచనలు ఉండవచ్చు.
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం ఆశించిన విధంగా ఉంటుంది. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి.