E-Paper
Advertisement

Health Tips: లంచ్‌ లేదా డిన్నర్‌ తర్వాత నిద్రొస్తుందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలు ఇవే!

Health Tips: లంచ్‌ లేదా డిన్నర్‌ తర్వాత నిద్రొస్తుందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలు ఇవే!
Advertisement

Health Tips: సాధారణంగా మనలో చాలామందికి భోజనం చేసిన వెంటనే నిద్రపోవాలని అనిపిస్తుంటుంది. ఇది సాధారణ అలవాటే అని మనం అనుకున్నప్పటికీ.. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మనిషి శరీరంలో ఆహారం జీర్ణం అయ్యే విధానం, ఇన్సులిన్ స్థాయిలు, శక్తి వినియోగం ఎలా జరుగుతుందో తెలుసుకుంటే.. తిన్న వెంటనే నిద్ర ఎందుకు వస్తుందో  కారణం కూడా తెలుసుకోవచ్చు.

శరీరానికి ఇంధనం ఆహారమే:

భోజనం మన శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తుంది. తిన్న వెంటనే ఇన్సులిన్ స్థాయిలు పెరగడమే కాకుండా.. షుగర్ లెవెల్స్‌ను సమతుల్యం చేస్తాయి. ఈ ప్రక్రియంతా జరిగితే ఆహారం జీర్ణం అవ్వగానే.. ఇన్సులిన్ స్థాయిలు తగ్గి శరీరంలో అలసట మొదలవుతుంది. అందుకే భోజనం తర్వాత నిద్ర మంచుకొస్తుంటుంది.

ఎక్కువ తింటేనే అలసట:

Advertisement

ఎక్కువగా తిన్నపుడు శరీరం ఎక్కువ ఎనర్జీని జీర్ణక్రియ కోసం ఉపయోగిస్తుంది. ఫలితంగా.. భోజనం చేసిన వెంటనే శరీరం ఎక్కువ అలసటను కోరుకుంటుంది. కాబట్టి.. తక్కువ కేలరీలతో సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం. దీంతో తిన్న వెంటనే నిద్ర వచ్చే సమస్యను తగ్గించుకోవచ్చు.

నిద్రకు కారణమైన ఆహారాలివే:

సోయా, గుడ్లు, బచ్చలి కూర, చేప, టోఫు వంటి వాటిలో సెరోటోనిన్ అనే ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. ఇది మెదడుకు నిద్రకు సంబంధించిన సిగ్నల్స్ పంపిస్తుంది. అదే విధంగా అరటి, చెర్రీస్ వంటి ఫ్రూట్స్ కూడా నిద్రకు సహకరిస్తాయి. కాబట్టి..  ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో సరైన అవగాహన ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

శారీరక శ్రమ తప్పనిసరి:

Advertisement

పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే సరిపోదు.. మరింత ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాల వ్యాయామం చేయడం అవసరం. దీంతో శరీరం ఫిట్‌గా మారడమే కాకుండా.. ఎనర్జీ స్థాయిలు పెరిగి అలసట తగ్గుతుంది. వ్యాయామం కేవలం శక్తిని పెంచడమే కాక.. ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడుతుంది.

చిన్న చిన్న మార్పులు:

ఆహారం తీసుకునే ముందు తగినంత నీళ్లు తాగడం, ఆల్కహాల్ లేదా ఎక్కువ కాఫీ తీసుకోవడం తగ్గించడం, విటమిన్ సి-రిచ్ ఫ్రూట్స్, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అలసటను తగ్గించడంలో  సహాయపడతాయి. ఈ క్రమంలో సీడ్స్, నట్స్ వంటి వాటిని కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఈ చిన్న మార్పులు చేసుకుంటే.. భోజనం తర్వాత శరీరం అలసిపోకుండా ఉంటుంది.

Related News

మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహార పదార్థాలు.. ఆ దేశాల్లో కంప్లీట్ బ్యాన్, ఎందుకో తెలుసా?

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

Big Stories

Advertisement
×