E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 తులా రాశి ఫలితాలు

Yearly Horoscope: 2026 తులా రాశి ఫలితాలు

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 తులా రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

తులా రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో శత్రువులు, అప్పులు, ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనుల్లో ఆలస్యం ఉన్నా క్రమంగా అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి శ్రమ అధికమవుతుంది. వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.  శని కుజ రాహు కేతు గ్రహాలకు జపదానాలు చేయించుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3

జనవరి:

ఈ నెలలో ఈ రాశి వారు శత్రువులపై ఆధిక్యం పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సమస్యలు లేదా అలసట కనిపించవచ్చు.  శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి పని ఒత్తిడి అనిపించినా, చివరికి మీ ప్రయత్నానికి గుర్తింపు వస్తుంది. 

ఫిబ్రవరి :

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు పెద్దగా మారకుండా చూసుకోవాలి. పనుల్లో ఆలస్యం, ఊహించని మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా డబ్బు విషయంలో ఆలస్యం కావచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు మనసుకు ఉపశమనం ఇస్తాయి.

మార్చి:

ఈ నెలలో ఈ రాశి వారికి  ఆదాయానికి తగ్గ ఖర్చుల వల్ల ఒత్తిడి కలగవచ్చు. తొందరపాటు మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లేదా అనవసర వ్యయాలు ఉండే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ఏప్రిల్:

ఈ నెలలో ఈ రాశి వారికి శ్రమ ఎక్కువైనా ఫలితం కనిపిస్తుంది. అధికారులతో వ్యవహరించే సమయంలో సహనం అవసరం. ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. కుటుంబ బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. ఆదాయ మార్గాల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సోదరులు, స్నేహితుల సహకారం లభించి పనులు సాఫీగా సాగుతాయి. వాణిజ్య లావాదేవీల్లో లాభ సూచనలు ఉన్నాయి.  ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

జూలై:

ఈ నెలలో ఈ రాశి వారు  ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్రం దర్శనాలు చేస్తారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలలో మార్పులు అనుకూలంగా ఫలిస్తాయి. కీలక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారు  అనవసర వాదనలు, న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలలో క్రమశిక్షణ, ఓర్పు అవసరం. ఉద్యోగంలో స్థిరత్వం ఉన్నా, పని భారం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన రావచ్చు. స్థిరాస్తి సంబంధిత ఆలోచనలు మొదలవుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. గత అప్పులు లేదా నిలిచిన బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది.  ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి  కుటుంబంలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం ఆశించిన విధంగా ఉంటుంది. వాహనాలు, స్థిరాస్తి విషయాల్లో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. బంధు వర్గ సహాయ సహకారాలు ఉంటాయి.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబంతో సంతృప్తికరమైన సమయం గడుపుతారు. చాలా కాలంగా అవని పనులు చిన్నపాటి కష్టంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తుపై స్పష్టత ఏర్పడుతుంది. నూతన వ్యాపార ప్రణాళికలు ఫలిస్తాయి.

ALSO READ: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×