E-Paper
Advertisement

KCR: కేసిఆర్ ఇంటి వద్ద సందడి.. గులాబీ బాస్‌ను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు

KCR: కేసిఆర్ ఇంటి వద్ద సందడి.. గులాబీ బాస్‌ను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
Advertisement

 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) నివాసం వద్ద శనివారం కోలాహలం నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన హైదరాబాద్‌లోని తన నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నగరానికి వచ్చారనే వార్త తెలియగానే.. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలివచ్చారు.

చాలా కాలం తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రావడంతో నంది నగర్ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తల నినాదాలతో మారుమోగిపోయింది. తమ అభిమాన నాయకుడిని చూడడానికి, ఆయనతో ఫోటోలు దిగడానికి అభిమానులు పోటీ పడ్డారు. కార్యకర్తల ఉత్సాహాన్ని గమనించిన కేసీఆర్, ఓపికగా వేలాది మందితో ఫోటోలు దిగారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేలా ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరించడం గమనార్హం.

Advertisement

ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ.. కేసీఆర్ వెంటనే వెనుతిరగడంతో కార్యకర్తలు కొంత నిరాశకు లోనయ్యారు. అయితే, ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లోనే మకాం వేయడం, పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంతో గులాబీ శ్రేణుల్లో మళ్ళీ పాత జోష్ కనిపిస్తోంది. వచ్చే రెండో తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ పూర్తిస్థాయిలో హాజరవుతారని.. సభలో తమ గళాన్ని బలంగా వినిపిస్తారని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించేందుకు ‘గులాబీ బాస్’ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ ప్రజల గొంతుకగా కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీలో గర్జిస్తారు’ అని అక్కడికి వచ్చిన కార్యకర్తలు స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో నంది నగర్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయేంతగా జనం తరలిరావడం చూస్తుంటే.. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.

Advertisement

ALSO READ: CM Revanth: ఇక చెరువులను కాపాడే బాధ్యత జోనల్ కమిషనర్లదే: సీఎం రేవంత్

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×