ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 వృశ్చిక రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తల్లి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఆదాయ మార్గాలు నెమ్మదిగా పెరుగుతాయి, ఇతరుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, స్థిరాస్తి వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6.
ఈ నెలలో ఈ రాశి వారు ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. కాని ఫలితం ఆలస్యంగా కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు ప్రధానంగా కనిపిస్తాయి. మనసు చంచలంగా ఉన్నా, స్థిర నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు అదుపులో ఉంటాయి. ధనవ్యయాలపై నియంత్రణ అవసరం.
ఈ నెలలో ఈ రాశి వారికి సోదరులు, సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ధన ప్రవాహం క్రమంగా మెరుగుపడుతుంది. మాటల వల్ల లాభం కూడా, నష్టం కూడా కలగవచ్చు. కాబట్టి సంయమనం చాలా అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి పోటీ పరిస్థితుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి, నిర్ణయ శక్తి బలపడుతుంది. ఉద్యోగంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి కనిపించవచ్చు.
ఈ నెలలో ఈ రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలకు లోనుకాకుండా ఆచితూచి వ్యవహరించాలి. వాహనం, భూమి విషయాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అధికారులతో సమస్యలు ఉండవచ్చ.
ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగ మార్పు, ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో అనూహ్యమైన పరిణామాలు మొదలవుతాయి. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆకస్మిక ఖర్చులు, మానసిక ఒత్తిడి కలగవచ్చు. ఇతరుల వ్యవహారాలలో ఆచితూచి మాట్లాడడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు, విదేశీ సంబంధాలు చర్చకు వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కొంత నిదానంగా సాగిన లాభాలు అందుకుంటారు.
ఈ నెలలో ఈ రాశి వారు ఊహించిన విధంగా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అధికారుల దృష్టి మీపై పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం ఆశించిన విధంగా ఉంటుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం కొంత శాంతంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది. నిలిచిపోయిన ధనం చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి అనుకూల సమయం.
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. శుభకార్యాల ఆలోచనలు మొదలవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభలు పొందుతారు. దైవ చింతన పెరుగుతుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి క్రయ విక్రయాల విషయాల్లో మరొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీర్చుకోవడం మంచిది. ఆత్మవిశ్వాసం బలపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు మంచి కాలం. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా ఊరట కలుగుతుంది. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు విశేషంగా పూర్తవుతాయి. ఆశించిన విధంగా సాగుతాయి ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి.