E-Paper
Advertisement

Polydipsia: మితిమీరిన దాహం.. ఇది కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాదు, అంతకు మించి !

Polydipsia: మితిమీరిన దాహం.. ఇది కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాదు, అంతకు మించి !
Advertisement

Polydipsia: ఎప్పుడూ దాహంగా అనిపించడం (ఎక్కువగా నీళ్లు తాగాలనిపించడం) అనేది సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ.. బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ హెచ్చరికల ప్రకారం.. మితిమీరిన దాహం అనేది కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం. ఈ స్థితిని ‘పాలిడిప్సియా‘ (Polydipsia) అని పిలుస్తారు. కొంత మందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.  దీనికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 అతి దాహానికి గల కారణాలు: 

Advertisement

1. మధుమేహం:

Advertisement

అధిక దాహానికి అత్యంత సాధారణ కారణం డయాబెటిస్. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, కిడ్నీలు ఆ అదనపు చక్కెరను బయటకు పంపడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో శరీరంలోని ద్రవాలు యూరిన్ ద్వారా ఎక్కువగా బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై, మెదడు నిరంతరం నీరు తాగమని సంకేతాలను పంపుతుంది.

2. డయాబెటిస్ ఇన్సిపిడస్ :

ఇది సాధారణ షుగర్ వ్యాధి కంటే భిన్నమైనది. ఇది శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో కిడ్నీలు నీటిని నిల్వ ఉంచుకోలేవు. దీని వల్ల వారు అతిగా మూత్రవిసర్జన చేయడం అంతే కాకుండా విపరీతమైన దాహానికి గురవ్వడం జరుగుతుంది.

3. డీహైడ్రేషన్: 

మనం తీసుకునే నీటి కంటే శరీరం కోల్పోయే నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు డీ హైడ్రేషన్ ఏర్పడుతుంది. వ్యాయామం, ఎండలో తిరగడం, వాంతులు లేదా విరేచనాలు అయినప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం.

4. నోరు ఆరిపోవడం:

కొన్నిసార్లు లాలాజల గ్రంథులు తగినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయలేవు. దీని వల్ల నోరు ఎప్పుడూ ఆరిపోయినట్లు ఉండి, దాహంగా అనిపిస్తుంది. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.

5. మానసిక కారణాలు:

కొందరిలో ఎలాంటి శారీరక వ్యాధి లేకపోయినా.. మానసిక కారణాల వల్ల లేదా అలవాటుగా నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. దీనిని ‘సైకోజెనిక్ పాలిడిప్సియాఅంటారు.

ఇతర లక్షణాలు గమనించండి:

కేవలం దాహం మాత్రమే కాకుండా.. ఈ కింది లక్షణాలు కూడా ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి.

తరచుగా యూరిన్ చేయడం (ముఖ్యంగా రాత్రి వేళల్లో).

చూపు మందగించడం.

అలసట, నీరసం.

గాయాలు త్వరగా మానకపోవడం.

కారణం లేకుండా బరువు తగ్గడం.

ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి ?

NHS సూచనల ప్రకారం.. మీరు తగినంత నీరు తాగినప్పటికీ మీ దాహం తీరకపోతే లేదా పైన పేర్కొన్న లక్షణాలతో పాటు విపరీతమైన దాహం వేస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రక్త పరీక్ష, యూరిన్ ద్వారా దీనికి గల అసలు కారణాన్ని గుర్తించవచ్చు.

దాహం అనేది శరీరం మనకు ఇచ్చే ఒక హెచ్చరిక. వేసవిలో లేదా ఉప్పగా ఉండే ఆహారం తిన్నప్పుడు దాహం వేయడం సహజం. కానీ.. ఎలాంటి కారణం లేకుండా నిరంతరం దాహంగా అనిపిస్తే అది శరీరంలో ఏదో లోపం ఉందనడానికి సంకేతం. సరైన సమయంలో స్పందించి డాక్టర్ సలహా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×