Remedies for Wealth: మీ సంపద పెరగాలంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, దానికి సరైన ప్రణాళిక, ఆచరణ మరియు ఆధ్యాత్మిక చింతన కూడా తోడవ్వాలట. సంఖ్యాశాస్త్రం, వాస్తు మరియు ఆర్థిక సూత్రాల ప్రకారం సంపదను ఆకర్షించడానికి మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక క్రమశిక్షణ (Financial Strategy): మీ ఆదాయంలో కనీసం 20% భవిష్యత్తు అవసరాల కోసం లేదా పెట్టుబడి కోసం పక్కన పెట్టాలట. డబ్బును బీరువాలో ఉంచితే పెరగదు. దానిని భూమి (Real Estate), బంగారం లేదా షేర్ మార్కెట్ వంటి లాభదాయకమైన రంగాల్లో పెట్టుబడిగా మార్చాలట.
వాస్తు సూత్రాలు (Vastu Tips): మీ ఇంట్లో సంపదను ఆకర్షించే కుబేర స్థానం మీద దృష్టి పెట్టండి. మీ ఇంట్లో లేదా కార్యాలయంలో ఉత్తర దిక్కు సంపదకు అధిపతి అయిన కుబేరుడిది. ఈ దిక్కును ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచండి. ఇక్కడ నీలి రంగు పెయింటింగ్ లేదా నీటి ఫౌంటెన్ ఉంచడం శుభప్రదమట. ఇక ఈశాన్యం మూలలో బరువైన వస్తువులు ఉంచకూడదట. ఇక్కడ దైవ ప్రార్థన లేదా ధ్యానం చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందట. మీ సంపాదన, నగదు లేదా ముఖ్యమైన పత్రాలను నైరుతి మూలలో ఉన్న బీరువాలో ఉంచాలట. బీరువా తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉంచాలట.
ఆధ్యాత్మిక పరిహారాలు (Spiritual Practices): ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి, ‘కనకధారా స్తోత్రం’ లేదా ‘శ్రీ సూక్తం’ పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. అలాగే మీ సంపాదనలో కొంత భాగాన్ని అన్నదానం లేదా పేద విద్యార్థుల చదువుకు ఖర్చు చేయాలట. ఇస్తేనే వస్తుంది అనేది సృష్టి ధర్మమట.
సానుకూల దృక్పథం (Money Mindset): డబ్బు సంపాదించడం కష్టం అనే ఆలోచన వదిలేసి నా దగ్గరకు సంపద అప్రయత్నంగా వస్తోంది అనే సానుకూల వాక్యాలు ప్రతిరోజూ ఉదయం అనుకోవాలట. లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రత, ప్రశాంతత మరియు గౌరవం ఉంటాయో అక్కడ స్థిరంగా ఉంటుందట. కాబట్టి మీ ఇల్లు, ఆఫీసును ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోమని పండితులు సూచిస్తున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం (Numerology): మీ పుట్టిన తేదీ మరియు డెస్టినీ నెంబర్‌ను బట్టి ( డెస్టినీ నెంబర్ అంటే మీ బర్తు డేటులోని అంకెలన్నీ కూడగా వచ్చేది. ఉదాహారణకు మీరు 1-12-1984లో పుడితే ఈ అంకెలు అని కూడాలి. అప్పుడు వచ్చే మొత్తం సంఖ్య మీ డెస్టినీ నెంబర్ అవుతుంది.) మీరు ఒకటో తేదీన పుడితే మీరు ఎప్పుడూ పర్సులో ఒక వెండి నాణెం లేదా ఆకుపచ్చని కర్చీఫ్ ఉంచుకోవడం వల్ల ‘బుధ’ గ్రహ ప్రభావంతో వ్యాపార లాభాలు మెరుగవుతాయట. అలాగే ముఖ్యమైన లావాదేవీలు చేసేటప్పుడు మీ అదృష్ట సంఖ్యలు (1, 5, 6) వచ్చేలా చూసుకోవాలట. ఇలాగే మిగతా తేదీలలో పుట్టిన వారికి కూడా వారి వారి అంకెలను బట్టి పరిహారలు మారుతుంటాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.