E-Paper
Advertisement

ట్రంప్ వార్ గేమ్.. గల్ఫ్ ఖజానా ఖాళీ.. డాలర్ ఆధిపత్యానికి ముగింపు మొదలైందా?

ట్రంప్ వార్ గేమ్.. గల్ఫ్ ఖజానా ఖాళీ.. డాలర్ ఆధిపత్యానికి ముగింపు మొదలైందా?
Advertisement

US Iran: అమెరికా-ఇరాన్ యుద్ధ నష్టాలు తడిసి మోపెడవుతున్నాయ్. అమెరికా దూకుడు చర్యలతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయ్. ఇదంతా ట్రంప్ తీరుతోనే.. కొన్ని దేశాలైతే మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉన్నాయ్. ముఖ్యంగా గల్ఫ్ దేశాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అమెరికా ఆర్మీ బేస్ లు ఖతార్, సౌదీ వంటి చోట్ల ఉన్నాయి. అయితే ఇరాన్ ఈ అమెరికన్ ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసుకుంది. చాలా సార్లు మిసైల్ ఎటాక్స్ జరిగాయి. వీటితో పాటే ఆయిల్ రిఫైనరీల దగ్గర కూడా పేలుళ్లు జరిగాయి. దీంతో చాలా నష్టపోయాయి. రికవరీకి టైం పడుతోంది. ఈ నష్టం ఎవరు భరించాలి? ఇప్పుడిదే కీలకంగా మారుతోంది.

ఇరాన్ యుద్ధం.. అమెరికాపై ఆర్థిక భారం

యుద్ధంతో అమెరికాకే చాలా నష్టం జరిగింది. ఇక మిత్ర దేశాలను ఆదుకునే పరిస్థితి ఉంటుందా? ఇరాన్‌ యుద్ధం.. ఇప్పుడు అమెరికాపై ఆర్థిక భారం మోపేలా తయారైంది. ఈ యుద్ధంతో జరిగిన నష్టాన్ని భరించాలని USపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ బెయిలవుట్‌ ప్యాకేజీ డిమాండ్ చేసింది. మిగితా గల్ఫ్‌ దేశాలు ఆ బాటలోనే వెళ్లేందుకు రెడీ అవుతున్నాయ్.

ట్రంప్‌కు కొత్త సవాల్

Advertisement

ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటే మరోవైపు తమ దేశంలో జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాల్సిందే అని ఇరాన్‌ డిమాండ్ చేస్తోంది. యుద్ధం నుంచి తప్పుకుంటే ఒక భారం.., కంటిన్యూ చేస్తే మరో భారం అన్నట్లుగా సీన్ మారింది. ఇప్పటికే యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెట్టింది. చాలా విమానాలు నష్టపోయింది. మిసైల్స్ కూడా చాలా వరకు కరిగిపోయాయి. వీటికి తోడు గల్ఫ్ దేశాల డిమాండ్లతో అమెరికాకు చికాకులు తప్పేలా లేవు. నిజానికి యుద్ధానికి హెల్ప్ చేయాలని గల్ఫ్‌ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోరుతారని ప్రచారం జరుగుతున్న టైంలో అవే తిరిగి సహాయం కోరడం సంచలనంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.

గ్లోబల్ ఆయిల్ మార్కెట్ షాక్

ఈ యుద్ధంతో గల్ఫ్‌ దేశాల్లో ఒకటైన యూఏఈ చాలా నష్టపోయింది. ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ తో దుబాయ్‌లోని హిస్టారికల్ ప్లేసెస్, కీలకమైన ఫ్యూయెల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రోజూ మిలియన్‌ బ్యారెళ్ల క్రూడ్ ఎక్స్ పోర్ట్ చేసే ఫజైరా ఆయిల్‌ టెర్మినల్‌ ధ్వంసమైంది. అంతేకాదు అమెజాన్‌ డేటా సెంటర్లపై ఎటాక్స్ జరగడంతో బ్యాంకింగ్‌ సర్వీసెస్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఈ నష్టాలతో పాటు యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో డౌట్ ఫుల్ గా ఉంది. దీంతో పునర్నిర్మాణానికి సాయం చేయాలంటూ అమెరికాతో యూఏఈ చర్చలు మొదలు పెట్టింది.

అమెరికాకు మరో కొత్త తలనొప్పి

Advertisement

యూఏఈ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఖలీద్‌ మహమ్మద్‌… అమెరికా ఫెడరల్‌ రిజర్వుతో కరెన్సీ స్వాప్‌ డీల్ కోసం చర్చలు జరుపుతున్నారు. అంటే అమెరికా.. డాలర్లలో రుణం ఇస్తే యూఏఈ తన సొంత కరెన్సీ దిర్హమ్‌లలో తిరిగి చెల్లిస్తుంది. ఇదే టైంలో క్రూడాయిల్ లావాదేవీల కోసం డాలర్లకు బదులుగా చైనా కరెన్సీ యువాన్‌ వైపు మళ్లుతామని యూఏఈ సిగ్నల్స్ ఇచ్చింది. ఇది అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ ఎఫెక్ట్ తగ్గే ప్రమాదం ఉంది. ఇది అమెరికాకు మరో సమస్యగా మారింది. యుద్ధం ముగిశాక భవనాలను, ఆయిల్ ఫెసిలిటీస్ ను మళ్లీ నిర్మించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాకు 60 బిలియన్‌ డాలర్ల ఖర్చు ఉందంటున్నారు. ఇందులో క్రూడ్ ఇన్ ఫ్రా ఫెసిలిటీస్ ను పునరుద్ధరించడానికే 50 బిలియన్‌ డాలర్లు కావాలంటున్నారు. అటు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్‌ యుద్ధంలో పాల్గొన్నాయని ఇరాన్‌ ఆరోపిస్తోంది. దీనికి పరిహారంగా 270 బిలియన్‌ డాలర్లు పే చేయాలని డిమాండ్ చేస్తోంది. హర్ముజ్‌లో టోల్ వసూలు చేసుకోవడంతో పాటు ఇలాంటి వాటిని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఓవరాల్ గా చూస్తే వార్ బిల్ తడిసి మోపెడయ్యే ప్రమాదాలే కనిపిస్తున్నాయ్.

చర్చలపై ట్రంప్ షాకింగ్ ట్విస్ట్

ట్రంప్ తాను ఏది అనుకుంటారో అదే చేస్తారు.. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకెళ్తారు.. ఇరాన్ తో చర్చల విషయంలోనూ అదే నడుస్తోంది. సీనియర్ స్టాఫ్ సలహాలను పక్కన పెట్టేస్తున్నారు ట్రంప్. చర్చల కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసేలా బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇరాన్‌ వెళ్లిన పాక్‌ మధ్యవర్తులు ఇచ్చిన సమాచారంపై మాట్లాడుతూ వచ్చారు. శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించడం సహా ఇంకొన్ని డిమాండ్లకు ఇరాన్ అంగీకరించిందని, యుద్ధం ముగిసిందని ప్రకటనలు చేశారు. దీంతో ఇరాన్ రగిలిపోయింది. ఇదేం తీరు అని క్వశ్చన్ చేసింది. ట్రంప్ తీరుతో మలి విడత చర్చలైనా ఫలిస్తాయా లేదా అన్న డౌట్లు పెరుగుతున్నాయ్.

కాల్పుల విరమణ పొడిగింపు..

అమెరికా – ఇరాన్‌ మధ్య ఏప్రిల్ 8న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో దీన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ల అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ అంటున్నారు. ఈ ఘర్షణ ముగించేందుకు ఇరాన్‌ ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చేదాకా దానిపై దాడులు చేయబోమన్నారు. అసలు ఈ యుద్ధం విషయంలో ట్రంప్ తీరుపై సైనిక నాయకత్వం తీవ్ర వ్యతిరేకతతో ఉంది. రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ సైన్యంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టారు. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు డజనుకు పైగా సీనియర్ అధికారులను తొలగించారు.

ట్రంప్ ఆదేశాలకు జనరల్స్ నో

ఇరాన్‌పై భారీ ఎత్తున భూతల దాడి చేయాలన్న ట్రంప్ ఆదేశాలను చాలా మంది సీనియర్ జనరల్స్ నిరాకరించారు. ఈ ఆదేశాలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అన్నారు. అయితే తన విధానాలతో ఏకీభవించని జనరల్స్ సైన్యం నుండి తప్పుకోవాలని రక్షణశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. సో ఆర్మీకి, ట్రంప్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అయితే కనిపిస్తోంది. ఇది ఒక ఎపిసోడ్ అయితే.. ఇప్పటి వరకు జరిగిన ఈ యుద్ధంతో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మొదటి నెలలోనే సుమారు 590 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 49 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని అంచనాలున్నాయ్.

గల్ఫ్ దేశాలకు 120 బిలియన్ డాలర్ల నష్టం

2026లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు ముందెన్నడూ లేని విధంగా ఆర్థికంగా చితికిపోయాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేత ఈ ప్రాంతాన్నే కాక ప్రపంచ ఇంధన రంగాన్ని గందరగోళంలోకి నెట్టింది. గల్ఫ్ దేశాలకు జరిగిన మొత్తం నష్టం సుమారు 120 బిలియన్ డాలర్లు ఉంటుందన్న అంచనాలున్నాయ్. అంటే 10 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద LNG ఎగుమతిదారు అయిన ఖతార్‌కు తీరని నష్టం జరిగింది. ఇరాన్ దాడుల వల్ల రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్ దెబ్బతింది. దీనివల్ల ఉత్పత్తి 17% పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చడానికి 3 నుంచి 5 ఏళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేశారు. దీనివల్ల ఖతార్ ఏడాదికి సుమారు 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోనుంది. అంటే ఎంత నష్టమో ఊహించుకోవచ్చు.

గల్ఫ్ ఎకానమీపై డబుల్ దెబ్బ

అటు యూఏఈ, సౌదీ అరేబియాలోనూ ఇబ్బందులు తప్పలేదు. ఈ దేశాల ఆయిల్ రిఫైనరీలు, పైప్‌లైన్లు దాడుల్లో దెబ్బతిన్నాయ్. వీటి పునర్నిర్మాణానికి దాదాపు 60 బిలియన్ డాలర్ల ఖర్చవుతుందని అంచనా. టూరిజం రంగం పూర్తిగా కుదేలైంది. ముఖ్యంగా దుబాయ్ వంటి నగరాల్లో రిటైల్, టూరిజం ఆదాయం చాలా వరకు తగ్గింది. ఎప్పుడూ కళకళలాడే దుబాయ్ నేల చూపులు చూస్తున్న పరిస్థితి.

ఖతార్‌కు భారీ దెబ్బ

హర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో సమస్యలు పెరిగాయ్. ప్రపంచంలోని 20% LNG సరఫరా ఈ జలసంధి మీదుగానే జరుగుతుంది. ఇరాన్ దీన్ని మూసివేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. సౌదీ అరేబియా, యూఏఈలకు చమురు రవాణాకు ఇతర పైప్‌లైన్లు ఉన్నప్పటికీ, ఖతార్ LNG సప్లైకి హార్ముజ్ జలసంధి తప్ప వేరే రూట్ లేదు. దీంతో ఎగుమతులు సాధ్యం కాకపోవడంతో ఖతార్ ఎనర్జీ సంస్థ తన ఎగుమతులపై ఫోర్స్ మజూర్ ప్రకటించింది. అంటే అనివార్య కారణాలతో ఒప్పందాలను అమలు చేయలేనని ప్రకటించింది.

గల్ఫ్ దేశాల డిమాండ్

యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా నుంచి ఆర్థిక గ్యారెంటీ కావాలని యూఏఈ వంటి దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. తాగునీటిని అందించే డీశాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరపొద్దని, పౌర సదుపాయాలకు రక్షణ కల్పించాలని గల్ఫ్ దేశాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ యుద్ధంలో అత్యధికంగా నష్టపోయింది ఇరానే. ఇరాన్ ప్రభుత్వం ప్రకారం తమ దేశంలో ప్రత్యక్ష, పరోక్ష నష్టం సుమారు 270 బిలియన్ డాలర్ల వరకు ఉంది. సుమారు 1.25 లక్షల పబ్లిక్ ప్లేసెస్, వందలాది హాస్పిటల్స్, పరిశ్రమలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. యురేనియం శుద్ధిని నిలిపివేసి, నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీకి అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం అంటోంది. మరోవైపు IMF లాంటి అంతర్జాతీయ సంస్థలు యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యం తప్పదని యుద్ధం ముగించాలంటోంది.

ట్రంప్ యుద్ధ నిర్ణయం వెనుక మిస్టరీ ఏమిటి?

ట్రంప్ అసలు యుద్ధం ఉన్నఫళంగా ఎందుకు మొదలు పెట్టారో ఎవరికీ తెలియదు. ఇజ్రాయెల్ కు సపోర్ట్ అని చెప్పి పూర్తిస్థాయి అమెరికానే రంగంలోకి దిగింది. తెలిసి చేస్తున్నారా.. తెలియక యుద్ధం చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. వీటికి తోడు కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్ దగ్గర అలజడులు మాత్రం తగ్గట్లేదు. అటు అమెరికా బలగాలు, ఇటు ఇరాన్ నేవీ మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. షిప్పులపై దాడులు కొనసాగుతున్నాయి. ఎంత వరకైనా తాము రెడీ అని ఇరాన్ అంటోంది.

ట్రంప్ యుద్ధం.. ప్రపంచ ఎకానమీపై భారీ దెబ్బ

ట్రంప్‌ మొదలు పెట్టిన యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు, ప్రజల జీవితాలు దెబ్బతింటున్నాయి. హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ బ్లాక్ చేయడంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అన్ని దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ యుద్ధం అమెరికా మిత్రదేశాలైన జపాన్, సౌత్ కొరియాలపైనా ఎఫెక్ట్ చూపుతోంది. నాటో దేశాల మాదిరి జపాన్, సౌత్ కొరియాలు కూడా తమ డిఫెన్స్ బడ్జెట్‌ను జీడీపీలో 5 శాతానికి పెంచాలని ట్రంప్‌ ప్రెజర్ పెంచుతున్నారు. ఇప్పుడు హర్ముజ్‌ దగ్గర క్రూడ్ సప్లై నాన్ స్టాప్ గా జరిగేలా చూడ్డానికి ఎక్కడెక్కడో ఉన్న తమ వార్ షిప్స్ ను పశ్చిమాసియాకు తరలిస్తున్నారు.

ఆసియా భద్రతపై ఆందోళన

జపాన్, సౌత్ కొరియాల్లోని అమెరికన్‌ యుద్ధ నౌకలు, క్షిపణులు, ఫైటర్ జెట్స్, సైనికులను పశ్చిమాసియాకు తరలిస్తే సౌత్ కొరియాకు నార్త్ కొరియా నుంచి ముప్పు పెరిగే ప్రమాదం ఉంది. జపాన్, సౌత్ కొరియా తీర సముద్ర జలాల్లో చైనా స్పీడ్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే ఉత్తర కొరియా జపాన్‌ సముద్రం వైపు 10 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. టైం చూసి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇరాన్‌ మాదిరిగానే నార్త్ కొరియా కూడా అణ్వాయుధం తయారీకి సిద్ధమవుతోందన్న ఆందోళనలో ఉన్నాయి.

ట్రంప్‌కు మిత్రదేశాల షాక్

నిజానికి యుద్ధం విషయంలో గల్ఫ్ దేశాలను ఎలాగైతే ట్రంప్ వాడుతున్నారో నాటో దేశాలను కూడా హెల్ప్ అడిగారు. సైనిక వనరులు కావాలన్నారు. కానీ నాటో దేశాలు అందుకు అంగీకరించలేదు. అటు అమెరికా దగ్గర మిసైల్స్ సంఖ్య తగ్గుతోంది. దీంతో జపాన్, సౌత్ కొరియా నుంచి క్షిపణులు తరలించాలని ట్రంప్ అన్నారు. అయితే చమురు విషయంలో ఇరాన్ తో ఈ రెండు దేశాలకు రిలేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ క్షిపణులు పంపితే మొదటికే మోసం వస్తోందని జపాన్, సౌత్ కొరియా భయపడ్డాయి. చివరకు అక్కర్లేదని ట్రంప్ అనడంతో ఊపిరి పీల్చుకున్నాయి. సీజ్ ఫైర్ టైంలో జపాన్, ఇరాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య కూడా చర్చలు జరిగాయి. జపాన్ షిప్పులను సేఫ్టీగా తీసుకెళ్లే విషయంపై చర్చించారు.

యుద్ధంపై ప్రజల ఆగ్రహం

యుద్ధాన్ని ప్రారంభించడం ఈజీనే. కానీ ముగించడమే ఎప్పుడూ కష్టమైన విషయం. ట్రంప్‌ ఈ నిజాన్ని పక్కన పెట్టేశారు. తన చర్యలతో మొత్తం ప్రపంచానికి నష్టం చేస్తున్నారు. ఇది ట్రంప్ కూ తెలుసు. అమెరికన్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక దశలో భారీ నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ రేట్లు కూడా పెరిగాయి. ఇక ఈ యుద్ధంతో మనదేశంపైనా చాలానే ఎఫెక్ట్ పడింది. ఎల్పీజీని ఎక్కువగా నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో మొదట్లో వంటగ్యాస్ సమస్య వచ్చింది. ఆటో ఎల్పీజీ సమస్య ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం కిలో 100కు పైనే రేట్ ఉంది.

ఇండియాపై యుద్ధ ప్రభావం.. ఫ్యూయెల్ దిగుమతులపై టెన్షన్

ఇరాన్‌ అటాక్స్ తో ప్రపంచంలోనే అతిపెద్ద LNG సప్లయర్ అయిన ఖతార్‌ ఎనర్జీకి భారీ నష్టాన్ని కలిగించాయి. దీంతో ఉత్పత్తి 17శాతం తగ్గి, ప్రపంచ వ్యాప్తంగా సప్లైకి గ్యాప్ ఏర్పడింది. ఇండియాకు ఖతార్‌తో ఎల్‌ఎన్‌జీ సప్లై కోసం దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నాయి. ఇక యూఏఈ భారత్ కు నాలుగో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఉంది. రెండో అతిపెద్ద LNG, LPG సప్లయర్ కూడా. అందుకే సీజ్ ఫైర్ టైంలో భారత్ తన ఫ్యూయెల్ దిగుమతి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ యూఏఈకి వెళ్లగా, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ ఖతార్‌కు వెళ్లి చర్చలు జరిపారు. సో మన దేశానికి కూడా యుద్ధంతో చాలానే ఎఫెక్ట్ పడింది.

ట్రంప్ ప్లాన్ హాట్ టాపిక్

యుద్ధం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని అమెరికా ఒక్కటే మోయడానికి ట్రంప్ సిద్ధంగా లేరు. ఇరాన్ తో యుద్ధం ఆ ఖర్చును అరబ్ దేశాలు భరించాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. 1990 గల్ఫ్ యుద్ధం సమయంలో మిత్రదేశాలు అమెరికాకు దాదాపు 54 బిలియన్ డాలర్లు చెల్లించినట్లుగానే, ఇప్పుడు కూడా వారు నిధులు సమకూర్చాలని ట్రంప్ భావిస్తున్నారు. నాడు ఇరాక్ ఆక్రమణ నుంచి తమ దేశాలను రక్షించుకోవడానికి, చమురు నిల్వలను కాపాడుకోవడానికి సౌదీ అరేబియా, కువైట్, UAE దేశాలు అమెరికాకు భారీగా నిధులు సమకూర్చాయి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండటం జపాన్, జర్మనీ వంటి పారిశ్రామిక దేశాలకు చాలా అవసరమైంది. అందుకే వారు కూడా పెద్ద ఎత్తున నాడు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు కూడా హర్ముజ్ తెరిపించానని చెప్పి ట్రంప్ ఏదైనా మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.

ట్రంప్ హయాంలో అసాధ్యం!

ట్రంప్ పరిపాలనలో ఇతర దేశాలకు యుద్ధ నష్టపరిహారం చెల్లించడం అన్నది దాదాపు అసాధ్యం అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ హయాంలో అమెరికా విదేశీ సహాయాన్ని భారీగా తగ్గించింది. 2025లో ఈ సహాయం 57 శాతం తగ్గించారు. అలాంటిది ఇప్పుడు యుద్ధంతో జరిగిన నష్టాన్ని భరిస్తారనుకోవడం కష్టమే. ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోణంలోనే ఉంటుంది. ఉచితంగా ఏ దేశానికి రక్షణ కల్పించకూడదనేది ట్రంప్ ప్రధాన థియరీ. అయితే ఇక్కడ అమెరికా చేసిన యుద్ధంతోనే గల్ఫ్ దేశాలకు సమస్య పెరిగింది. ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ… లేని యుద్ధాన్ని క్రియేట్ చేశారు. మళ్లీ ఆ ఖర్చుల భారాన్ని ఇతర దేశాల నుంచే వసూల్ చేసే ప్లాన్ లో ఉన్నారు. యుద్ధం ఆర్థికంగా అమెరికాను కూడా బలహీనపరుస్తోంది. అందుకే దీన్ని ఎంత త్వరగా ముగిస్తే అమెరికాకే అంత లాభం.

సెకండ్ ఫేజ్ చర్చలపై ప్రపంచ ఆశలు

సమస్యలకు చెక్ పడాలంటే ముందు అంతా కలిసి ట్రంప్ మైండ్ సెట్ ను మార్చాలి. శాంతికి ఒప్పించాలి. సెకండ్ ఫేజ్ చర్చలు సఫలం కావాలని, శాంతి నెలకొనాలని ప్రపంచ దేశాలన్నీ ఆశిస్తున్నాయి. ఈ సంక్షోభం కొన్ని దేశాలకు ఇంధన భద్రత లేకుండా చేసింది. మరికొన్ని దేశాలకు జాతీయ భద్రతకు కారణమైంది.

Also Read:హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు, చర్చలకు సిద్ధమే

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×