E-Paper
Advertisement

30 ఏళ్ల ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ కానీ..?

30 ఏళ్ల ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ కానీ..?
Advertisement

H-City Project: స్వేచ్ఛ బ్యూరో:  గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు తోడు రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులు కేబీఆర్ పార్కు చుట్టూ ఊపందుకున్నాయి. హెచ్ సిటీ కింద కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1090 కోట్ల వ్యయంతో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ లను నిర్మించి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్న నేపథ్యంలో ఇటీవలే మొదలైన హెచ్ సిటీ పనులు ఇపుడు ఊపందుకున్నాయి. పనులను విలైనంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో, ఈ ప్రాజెక్టుకు ఇంకా జరపాల్సిన స్థల సేకరణ ప్రక్రియపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

మార్కెట్ విలువ ప్రకారం..

జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున అత్యంత ఖరీదు చేసే కేబీఆర్ పార్కు చుట్టున్న స్థలాల సేకరణ కోసం కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీ వద్ద ఆ పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకునే అవకాశం లేకపోవటంతో సేకరిస్తున్న స్థలాలకు గాను మార్కెట్ విలువ ప్రకారం నాలుగు రేట్లు ఎక్కువగా లబ్ది చేకూర్చేలా ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్)లు ఇచ్చి స్థలాలను సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ నిన్నమొన్నటి వరకు కూడా టీడీఆర్ తీసుకునేందుకు స్థల యజమానులు అంగీకరించకపోవటంతో ఇటీవలే కమిషనర్ కర్ణన్ స్థలాల యజమానులతో బంజారాభవన్ లో టీడీఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేయటంతో టీడీఆర్ తీసుకుని స్థలాలిచ్చేందుకు సగం కన్నా ఎక్కువ మంది అంగీకరించినట్లు తెలిసింది.

Advertisement

Also read: వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

మాజీ మంత్రి జానారెడ్డి..

మరో సారి టీడీఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా యోచిస్తున్నట్లు తెలిసింది. అంతటితో ఆగని కమిషనర్ కర్ణన్ స్థల సేకరణ విషయంపై మరో సారి మాజీ మంత్రి, అధికార పార్టీ నేత జానారెడ్డిని కలిసి చర్చించినట్లు తెలిసింది. కొద్ది నెలల ముందు కేబీఆర్ చుట్టూ హెచ్ సిటీ పనులు చేపట్టే ప్రాంతాలను సందర్శించిన కమిషనర్ నేరుగా జానారెడ్డి ఇంటికెళ్లి చర్చించిన సంగతి తెల్సిందే. స్థల సేకరణ ప్రక్రియకు సహకరించేందుకు తాను కూడా సిద్దంగా ఉన్నానని మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్కు చుట్టూ చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన ఆస్తులే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

స్థల సేకరణను సవాలు

Advertisement

టీడీఆర్ పట్ల స్థల యజమానులను ఆకర్షితులను చేసేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో మార్పులు కూడా చేసిన సంగతి తెల్సిందే. పైగా పనులు ఊపందుకున్న నేపథ్యంలో స్థల యజమానులు కూడా తాము ఏం చేసినా పనులు ఆగేలా లేవని కొందరు టీడీఆర్ లకు స్థలాలిచ్చేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. పది అంతస్తుల భవనాలకు టీడీఆర్ వినియోగాన్ని సర్కారు తప్పనిసరి చేయటంతో స్థల యజమానులు కొంత మేరకు ఆకర్షితులైనట్లు చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, కేబీఆర్ చుట్టూ స్థల సేకరణను సవాలు చేస్తూ కోర్టులో రెండు కేసులున్నట్లు సమాచారం. ఈ కేసుల పరిష్కారంపై కూడా జీహెచ్ఎంసీ వినతి మేరకు సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది.

Also read: గులాబీ కోటలో ముదురుతున్న అంతర్గత యుద్దం.. అక్కడే క్లాస్ పీకపోతున్న బాస్..!

ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు

కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన హెచ్ సిటీ పనుల్లో భాగంగా రానున్న 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సమస్యకు పరిష్కారాన్ని చేకూర్చేలా చేసిన డిజైనింగ్ ప్రకారం పార్కు చుట్టూ 7 స్టీల్ ఫ్లైఓవర్లు, మరో 7 అండర్ పాస్ లను నిర్మించనున్నారు. ఇందుకుగానూ పార్కు చుట్టూ 6 కూడళ్ళలో రోడ్డును విస్తరించి ఫ్లై ఓవర్ల పిల్లర్లు, అండర్ పాస్ లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఇక్కడ చేయాల్సిన స్థల సేకరణకు సుమారు రూ.741 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచాన వేశారు. దీంతో జీహెచ్ ఎంసీ రూపకల్పన చేసిన రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్(ఆర్డీపీ)లో మొత్తం 453 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు.

బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని..

మహారాజ అగ్రసేన్ కూడలిలో 44 ఆస్తులు, ఫిల్మ్ నగర్ కూడలిలో 43, రోడ్ నెంబర్ 45 కూడలిలో 40, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు కూడలిలో 73 ఆస్తులు, కేబీఆర్ పార్కు కూడలి-ముగ్ధా జంక్షన్ లో 61, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడలిలో 21, బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని విరించి హాస్పిటల్ నుండి అగ్రసేన్ కూడలి వరకు 171 ఆస్తులను సేకరించాలని ఆర్ డీపీలో అధికారులు సూచించారు. వీటిని సేకరించేందుకు జీహెచ్ఎంసి గత కొద్ది రోజులుగా ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న స్థల యజమానులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు.

కొందరు ఆస్తులను..

ఈ క్రమంలోనే రోడ్ నెం.48, ఫిల్మ్ నగర్, అగ్రసేన్ భవన్ కూడలిలోని బాధితులను పిలిచిన జోనల్ కమిషనర్ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా నిర్వహించారు. అందులో కొందరు ఆస్తులను ఇచ్చేందుకు అంగీకరిస్తుండగా, మరికొందరు ససేమిరా అనగా, ఇటీవల కమిషనర్ నిర్వహించిన టీడీఆర్ అవగాహన కార్యక్రమంలో టీడీఆర్ మార్గదర్శకాల్లో సర్కారు చేసిన మార్పులు, వాటి వల్ల స్థల యజమానులకు కలిగే ప్రయోజనాలు వివరించటంతో మరి కొందరు స్థలాలిచ్చేందుకు అంగీకరించినట్లు తెల్సింది.

Also read: కొత్త లుక్‌ లో అవెనిస్ స్కూటర్.. యువత కోసం సుజుకి సూపర్ ప్లాన్!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×