2026లో బజాజ్ పల్సర్ కీలక మైలు రాయి అందుకోబోతోంది. ఈ లైనప్ 25వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అప్ డేట్స్ తో పాటు కొత్త మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. బజాజ్ ఎక్స్ ఎక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ, MD రాజీవ్ బజాజ్ ఏకంగా 2026ను పల్సర్ ఇయర్ అభివర్ణించారు. డిసెంబర్ 2025 నుంచి మే 2026 వరకు కనీసం 3 కొత్త మోడల్స్ లాంచ్ అవుతాయన్నారు. ఈ బైక్స్ అన్నీ 125cc+ సెగ్మెంట్ లో ఫోకస్ చేస్తూ, GST కట్ తో మరింత అఫర్డబుల్ గా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం NS125, N160 మోడల్స్ ఇప్పటికే లాంచ్ అయ్యాయి. మిగతా మోడల్స్ 2026 మార్చి, మేలో లాంచ్ కాబోతున్నాయి.
⦿ పల్సర్ N160 (సింగిల్ సీట్ USD వేరియంట్): ఈ బైక్ రీసెంట్ గానే లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 1.24 లక్షలుగా నిర్ణయించారు. గోల్డ్ USD ఫోర్క్స్, బెటర్ హ్యాండ్లింగ్, కంఫర్ట్ తో వచ్చాయి. సింగిల్ సీట్ కాన్ఫిగరేషన్ తో ఫ్యామిలీ రైడర్స్ కు సూట్ అవుతాయి. కలర్స్ విషయానికి వస్తే పెర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, పోలార్ స్కై బ్లూ, బ్లాక్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, 164.8cc, 15.68 PS, బెటర్ రైడింగ్ డైనమిక్స్ ను కలిగి ఉంది.
⦿ జనరల్ 2026 పల్సర్ (అన్‌స్పెసిఫైడ్): ఈ బైక్ డిసెంబర్ 2025లో లాంచ్ కానుంది. ధర రూ. 95,000. బేసిక్ అప్ డేటెడ్ వెర్షన్. 125-160cc రేంజ్ ఉండొచ్చు. స్పోర్టీ కమ్యూటర్ ఫోకస్, కొత్త కలర్స్, గ్రాఫిక్స్ ఉంటాయని అంచనా.
⦿ కొత్త 125cc పల్సర్ మోడల్: ఇది మార్చి 2026లో అందుబాటులో లాంచ్ కానుంది. దీని ధర రూ. 85,000 – రూ.1.10 లక్షలు ఉంటుందని అంచనా. పల్సర్ బ్రాండ్ లో కొత్త వేరియంట్ గా రాబోతోంది. స్పోర్టీ స్టైలింగ్, మోడరన్ ఫీచర్స్ డిజిటల్ డిస్ ప్లే, USB చార్జింగ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది. 125cc సెగ్మెంట్ లో మార్కెట్ షేర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. హోండా Shineకి చాలెంజ్ విసురబోతోంది.
⦿ పల్సర్ NS350 (ఎక్స్ పెక్టెడ్): మే 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 1.50 – 1.80 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. NS400Z కంటే అఫర్డబుల్ వెర్షన్ తో డౌన్ సైజ్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. అడ్వాన్స్ డ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. డ్యూయల్ చానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ. 350cc సెగ్మెంట్‌లో ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ బైక్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.
⦿ సేఫ్టీ అప్ గ్రేడ్స్: మల్టీ-మోడ్ ABS రోడ్ కండిషన్స్ ప్రకారం అడ్జస్ట్ అవుతుంది. ఇండియన్ రోడ్లకు పర్ఫెక్ట్.
⦿ టెక్ ఫీచర్స్: ఫుల్ డిజిటల్ డిస్ ప్లేలు, నావిగేషన్, కాల్ అలర్ట్స్, యంగ్ రైడర్స్ కు మోడరన్ ఫీల్ కలుగుతుంది.
⦿ పెర్ఫార్మెన్స్: DTS-i ఇంజిన్స్ తో బెటర్ మైలేజ్, (50-60 kmpl), స్పోర్టీ హ్యాండ్లింగ్ (USD ఫోర్క్స్‌తో N160లో)తో వస్తున్నాయి.
⦿ స్టైల్: మస్కులర్ డిజైన్, కొత్త కలర్ ఆప్షన్స్ తో ప్రీమియం లుక్ ను కలిగి ఉంటాయి.
⦿ మార్కెట్ ఇంపాక్ట్: 125cc+ సెగ్మెంట్‌లో 8-12% గ్రోత్ ఎక్స్ పెక్టె చేస్తుంది. పల్సర్ ఇప్పటికే ఇండియాలో 2/3rd మార్కెట్ వాల్యూమ్ ను కలిగి ఉంది.
Read Also: ఆల్టో K10 To టియాగో.. రూ. 5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే!