E-Paper
Advertisement

Health Benefits: బీట్‌రూట్ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. రక్తపోటు నుంచి స్కిన్ గ్లో వరకూ 5 టాప్ బెనిఫిట్స్!

Health Benefits: బీట్‌రూట్ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. రక్తపోటు నుంచి స్కిన్ గ్లో వరకూ 5 టాప్ బెనిఫిట్స్!
Advertisement

Health Benefits: బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. బీట్‌రూట్ ఆకులు తినడం వల్ల ప్రధానంగా ఐదు ఆరోగ్య ప్రయోజనాల్ని పొందొచ్చని. ఈ ఆకుల్లో బీట్‌రూట్ కంటే కూడా ఎక్కువ పోషకాలు దాగి ఉంటాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ A, విటమిన్ K, యాంటీఆక్సిడెంట్స్ వంటి శక్తివంతమైన పోషకాలతో ఇవి శరీరానికి సమగ్ర పోషణ అందిస్తాయి. రోజువారీ ఆహారంలో ఈ ఆకులను చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యం, ఎముకల బలం, చర్మ కాంతి, రోగనిరోధక శక్తి.. ఇలా అనేక రకాలుగా ఆరోగ్యాన్ని కాపాడే శక్తి  బీట్‌రూట్ ఆకుల్లో ఉంది. సులభంగా అందుబాటులో ఉండే ఈ బీట్‌రూట్ ఆకులు ఎంత అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!

రక్తపోటును తగ్గిస్తుంది:

బీట్‌రూట్ ఆకులు నైట్రేట్‌లతో నిండి ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరింపజేసి రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు సహాయం అందుతుంది. ఈ ఆకులు తరచూ తీసుకోవడం వలన కిడ్నీలు శుభ్రపడటమే కాకుండా హైపర్‌టెన్షన్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

Advertisement

Read Also: ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

గుండె ఆరోగ్యం పదిలం:

ఈ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే శరీరంలోని కోలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం, రక్తనాళాల ఆరోగ్యం మెరుగవ్వడం వంటివి బీట్‌రూట్ ఆకుల కారణంగా జరుగుతుంది. అలాగే ఈ ఆకుల్లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె కొట్టుకునే సాధారణ లయను నియంత్రించడంలో సహకరిస్తుంది.

ఎముకలు దృఢంగా:

Advertisement

బీట్‌రూట్ ఆకుల్లో ఉండే విటమిన్ K, కాల్షియం వంటివి ఎముకలకు అత్యవసరమైన పోషకాలు. రోజూవారి ఆహారంలో బీట్‌రూట్ ఆకులను చేర్చుకుంటే.. ఎముకలకు బలం అందించి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పిల్లలు, మహిళలు ఈ ఆకులను తీసుకుంటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తి:

బీట్‌రూట్ ఆకుల్లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే దీనిలో ఉండే నైట్రేట్‌లు ఎముకలకు ఎక్కువ ఆక్సిజన్ చేరేలా చేస్తాయి. ఫలితంగా శారీరక శక్తి పెరుగుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా రోజువారీ పనుల్లో ఉత్సాహంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగకరం. బీట్‌రూట్ ఆకులు అథ్లెట్లకు మంచి నేచురల్ ఎనర్జీ సోర్స్.

జీర్ణశక్తి మెరుగుపడుతుంది:

బీట్‌రూట్ ఆకులు ఫైబర్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, పేగు సమస్యలను నివారిస్తుంది. పేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయం చేస్తూ, బ్లోటింగ్, కానిస్టిపేషన్ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు.. బీట్‌రూట్ ఆకులు బీటాలైన్ వంటి ఫైటోకెమికల్స్‌ను కలిగి ఉంటాయి. దీంతో ఇవి శరీరంలోని విషకణాలను తొలగించడంలో సహాయపడతాయి. కాలేయం పనితీరును మెరుగుపరచి, శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేస్తాయి.

Read Also: మధుమేహం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. సూపర్ ఫుడ్‌గా నిలుస్తున్న డ్రాగన్ ఫ్రూట్!

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×